స్నానం చేస్తోంటే వీడియో తీసి అత్యాచారం, వేధింపులతో బాధితురాలిలా..

కోల్‌కత్తా: ఓ కామాంధుడు విద్యార్ధిని స్నానం చేస్తుండగా వీడియో తీసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. అంతేకాదు బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాదు తరచూ బాధితురాలిని నిందితుడు వేధింపులకు గురి చేస్తుండడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

విద్యార్థినులు, మహిళలపై దేశ వ్యాప్తంగా అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలను చూస్తూనే ఉన్నాం. అయితే ఈ తరహ ఘటనలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షలు అమలు చేస్తేనే భవిష్యత్తులో ఎవరూ కూడ ఈ తరహ నేరాలకు పాల్పడకుండా ఉంటారనే అభిప్రాయాలను మహిళా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొత్త చట్టం తీసుకువచ్చారు. కానీ, ఆ రాష్ట్రంలో మహిళా ఎస్ఐ‌పైనే నిందితులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బెంగాల్ రాష్ట్రంలో విద్యార్థినిపై భవన నిర్మాణ కార్మికుడు దారుణానికి పాల్పడ్డాడు.

 బాత్‌రూమ్‌లో స్నానం చేస్తోంటే వీడియో తీసి

బాత్‌రూమ్‌లో స్నానం చేస్తోంటే వీడియో తీసి

పశ్చిమబెంగాల్‌లోని బోల్‌పూర్ ప్రాంతంలో 20 ఏళ్ల విద్యార్థి బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ఓ భవన నిర్మాణ కార్మికుడు ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ దృశ్యాలను ఆమెకు చూపి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. నిందితుడు ఆ వీడియోలను చూపి బాధిత విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Recommended Video

    శృంగారం తర్వాత అసలు మైనర్ ని భార్య గా చేసుకోవడం ఏంటి ? | Oneindia Telugu
    కోర్కె తీర్చేమని వేధింపులకు గురిచేసేవాడు

    కోర్కె తీర్చేమని వేధింపులకు గురిచేసేవాడు

    ఈ వీడియోల ఆధారంగా నిందితుడు బాధితురాలిని తీవ్రంగా బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. తన కోర్కెను తీర్చకపోతే వీడియోను బయటపెడతానని బాధితురాలిని వేధింపులకు గురిచేసేవాడు.

     వేధింపులు ఎక్కువ కావడంతో

    వేధింపులు ఎక్కువ కావడంతో

    భవన నిర్మాణ కార్మికుడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు ఇటీవలే తండ్రికి చెప్పింది. ఈ విషయమై నిందితుడి కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. అయితే అదే సమయంలో బాధితురాలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించిందని బాధితురాలి తండ్రి ఆరోపించారు.

    విద్యార్థి సంఘాల ఆందోళన

    విద్యార్థి సంఘాల ఆందోళన

    కాలేజీ విద్యార్థిని అయిన బాధితురాలు అత్యాచారం, బ్లాక్‌మెయిల్ బాధను తట్టుకోలేక ఆత్యహత్మ చేసుకున్నందన్న విషయం వెలుగులోకి రావడంతో ఏబీవీపి ఆందోళనకు దిగింది. కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసనలకు దిగింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+