2006 వారణాసి బాంబు పేలుళ్ల కేసు: దోషిగా తేలడంతో వలీవుల్లా ఖాన్‌కు మరణిశిక్ష, జీవితఖైదు
న్యూఢిల్లీ: 2006 వారణాసి వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలిన వలీవుల్లా ఖాన్‌కు సోమవారంనాడు మరణశిక్ష, జీవిత ఖైదు విధించింది కోర్టు. వారణాసి బాంబు పేలుడు కేసులో 18 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడిన కేసులో నిందితుడికి శిక్ష పడింది.
మార్చి 7, 2006న, వారణాసి మొదట సంకట్ మోచంటెంపుల్ వద్ద, తరువాత వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వద్ద 15 నిమిషాల వ్యవధిలో జంట పేలుళ్లతో దద్దరిల్లింది.

నివేదికల ప్రకారం.. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సమీపంలోని సంకట్ మోచన్ ఆలయంలో సాయంత్రం 6.15 గంటలకు మొదటి పేలుడు సంభవించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పేలుళ్లు జరిగిన వెంటనే వలీవుల్లాను అరెస్టు చేశారు. అయితే, వారణాసిలోని న్యాయవాదులు కోర్టులో అతని తరపున వాదించడానికి నిరాకరించడంతో అతని కేసు విచారణ ఘజియాబాద్‌లో జరిగింది.
వలీవుల్లాను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొనడంతోపాటు హత్యాయత్నం, ప్రమాదకరమైన ఆయుధాలతో స్వచ్ఛందంగా గాయపరచడం వంటి అనేక అభియోగాలతో అభియోగాలు మోపారు. పేలుడు పదార్థాల చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఇతర నిందితులు కూడా ఉన్నారు. వరుస బాంబు పేలుళ్ల కేసులో ముగ్గురు నిందితులు ఆచూకీ తెలియలేదు. పోలీసుల దాడిలో నాలుగో నిందితుడు చనిపోయాడు.












Click it and Unblock the Notifications