Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమ్మాయితో అమ్మాయి ప్రేమ: చంపేసి ఆత్మహత్య

మండ్య (కర్ణాటక): ప్రాణ స్నేహితురాలు పెళ్లి చేసుకుని దూరం అవుతుందని తట్టుకోలేక ఆమెను అతి దారుణంగా హత్య చేసిన యువతి చివరికి అవమానంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని మండ్యలో జరిగింది.

మండ్య పట్టణంలోని చాముండేశ్వరి నగరలో నివాసం ఉంటున్న అనూషా (21) అనే యువతి ఆత్మహత్య చేసుకుందని గురువారం పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని మిమ్స్ ఆసుపత్రికి తరలించామని రైల్వే పోలీసులు తెలిపారు.

దివ్యశ్రీ (21), అనూషా మండ్యలో ఒకే ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఇద్దరూ చిన్నపట్టి నుంచి కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులే. ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో దివ్యశ్రీకి వివాహం నిశ్చయం అయ్యింది.

21-year old Anusha committed suicide at Mandya in Karnataka

అయితే దివ్యశ్రీ పెళ్లి చేసుకోవడం అనూషాకు ఇష్టం లేదు. దివ్యశ్రీని అనూషా ప్రేమిస్తున్నది. దివ్యశ్రీతో పాటు వారి కుటుంబ సభ్యుల దగ్గర ఈ వివాహం జరగరాదని పలు సార్లు గొడవ చేసింది. అయితే వారు పట్టించుకోలేదు.

దివ్యశ్రీ పెళ్లి చేసుకుని దూరం అవుతుందని ఆందోళన చెందిన అనూషా ఎలాగైనా పెళ్లి నిలిపివేయాలని ప్లాన్ వేసింది. 2015 మార్చి 31వ తేదిన దివ్యశ్రీని నిర్జనప్రదేశంలోకి తీసుకువెళ్లి హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

దివ్యశ్రీని పలు సార్లు ముద్దులు పెట్టుకుంటున్న అనూషా ఫోటోలు చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. చివరికి అనూషాను పోలీసులు అరెస్టు చేశారు. స్నేహితురాలిని హత్య చేశానని అనూషా అంగీకరించింది.

21-year old Anusha committed suicide at Mandya in Karnataka

జైలులో ఉన్న అనూషా ఇటివల బెయిల్ మీద బయటకు వచ్చింది. అప్పటి నుంచి అనూసా జీవితంపై విరక్తి పెంచుకునింది. ప్రాణ స్నేహితురాలిని హత్య చేసిందని అనూషాను ఆమె స్నేహితులు పలకరించడం మానేశారు. మంగళవారం రాత్రి అనూషా యలియూరు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునింది.

బుధవారం రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేశారు. ఆత్మహత్య చేసుకునింది అనూషా అని నిర్ధారించుకుని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అవమానంతో అనూషా ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+