లవ్: ఎంజాయ్ చేశాడు, నిశ్చితార్థం అయ్యింది, గర్బవతి, హ్యాండ్ ఇచ్చాడు, ఆత్మహత్య
ప్రేమించిన వ్యక్తి నిశ్చితార్థం చేసుకుని గర్బవతిని చేసి మోసం చేశాడని జీవితంపై విరక్తి పెంచుకున్న యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది.
బెంగళూరు: ప్రేమించిన వ్యక్తి నిశ్చితార్థం చేసుకుని గర్బవతిని చేసి మోసం చేశాడని జీవితంపై విరక్తి పెంచుకున్న యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరులోని మైసూరు గార్డెన్ లో నివాసం ఉంటున్న హీనా కౌసర్ (20) అనే యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అన్నారు.
మైసూరు గార్డెన్ లో జియావుల్లా, పర్వీన్ తాజ్ దంపతులు నివాసం ఉంటున్నారు. జియావుల్లా, పర్వీన్ తాజ్ దంపతుల కుమార్తె హీనా కౌసర్. వీరి ఇంటి పక్కనే పూల వ్యాపారం చేస్తున్న నజీమ్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను హీనా కౌసర్ ను ప్రేమించాడు.

హీనా కౌసర్ అతని వలలో పడటంతో గత ఆరు నెలల నుంచి ఇద్దరూ శారీరకంగా కలుసుకుంటున్నారు. హీనా కౌసర్ గర్బవతి అయ్యింది. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు నెల క్రితం నజీమ్, హీనా కౌసర్ కు నిశ్చితార్థం చేశారు. హీనా కౌసర్ గర్బవతి అని తెలుసుకున్న నజీమ్ పెళ్లికి నిరాకరించాడు.
పెళ్లి చేసుకుంటానని నువ్వే గర్బవతిని చేసి ఇప్పుడు కాదంటే ఎలా ? అని హీనా కౌసర్ ప్రశ్నించింది. మంగళవారం సుమారు 7 నిమిషాల పాటు తనను పెళ్లి చేసుకోవాలని నజీమ్ ను హీనా కౌసర్ ఫోన్ లో మనవి చేసింది. పెళ్లికి నజీమ్ నిరాకరించడంతో జీవితంపై విరక్తి చెందిన హీనా కౌసర్ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నజీమ్ ను అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications