గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ.. మధ్యలోనే ఉరేసుకుని ఆత్మహత్య..

గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూనే.. మాటల మధ్యలో నేరుగా తన బెడ్ రూమ్ లోకి వెళ్లి చున్నీతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు.

ముంబై: 21ఏళ్ల ఓ మేనేజ్ మెంట్ స్టూడెంట్ అనుమానస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఆశ్చర్యంగా.. అతను ఆత్మహత్య చేసుకున్న సమయంలో అతని గర్ల్ ఫ్రెండ్ కూడా అదే ఇంట్లో ఉంది.

అతని గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం నాడు మిరా రోడ్డులోని సన్మిత్ రాణే(21) ఇంట్లో వీరిద్దరు ఏకాంతంగా కలుసుకున్నారు. ఇద్దరు ముచ్చటించుకుంటున్న క్రమంలో సన్మిత్ రాణే ఉన్నట్టుండి 'జీవితానికి ముగింపు పలకాలనిపిస్తుంది' అన్నాడు. అయితే అతను సరదాగానే ఆ వ్యాఖ్యలు చేయడంతో వాటినంత సీరియస్ గా పట్టించుకోలేదని ఆమె తెలిపింది.

21year old hangs to death, lover says it's prank gone wrong

' నువ్వు లేకపోతే నేను లేను.. నువ్వు నన్ను శిక్షించాలనుకుంటే గనుక నేను నా జీవితానికి ఇక్కడితో ముగింపు పలుకుతా' అని తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడిన రాణే.. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నేరుగా తన బెడ్ రూమ్ లోకి వెళ్లి చున్నీతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయిందని అతని గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు వెల్లడించింది.

అయితే కేవలం గర్ల్ ఫ్రెండ్ ను బెదిరించడానికే సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుని.. ఓ స్టూల్ పై నిలబడ్డ సన్మిత్ రాణే.. ప్రమాదవశాత్తు బ్యాలెన్స్ కోల్పోయి స్టూల్ ను తన్నేయడంతో సరదా కాస్త విషాదాన్ని మిగిల్చినట్టయింది.

రాణే ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతని గర్ల్‌ఫ్రెండ్ తీవ్ర భయాందోళనకు లోనైంది. ఆ సమయంలో ఓ ఫ్యామిలీ ఫ్రెండ్, మరో స్నేహితుడితో కలిసి.. కత్తితో సన్మిత్ రాణే మెడకు ఉన్న చున్నీని కోసి అతన్ని కిందకు దించారు. ప్రస్తుతం సన్మిత్ రాణే ఆత్మహత్యను అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అయితే రాణే కుటుంబం మాత్రం ఇదంతా ఓ కట్టు కథ అని ఆరోపిస్తుంది. కాగా, వీరిద్దరు ఒకే కాలనీలో నివసిస్తున్నారు. వీరి ప్రేమ వ్యవహారం కూడా ఇరు కుటుంబాల్లో తెలుసు. పోలీసుల దర్యాప్తు పూర్తయితే గానీ నిజాలు వెల్లడయ్యేలా లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+