రేప్: అందరికీ చెప్పిందని వివస్త్రగా రోడ్డుపైకి లాక్కొచ్చాడు

వివాహిత పైన అతను అత్యాచారం చేశాడు. దానిని ఆమె బహిర్గతం చేసింది. దీంతో రెచ్చపోయిన అతను దారుణంగా వ్యవహరించాడు. ఆగ్రహంతో ఆమెను వివస్త్రను చేసి నడిబజారులో నిలబెట్టి దారుణంగా అవమానించాడు.
బాధితురాలు ఫిర్యాదు ప్రకారం... బహిర్భూమికి వెళ్లిన ఆ యువతిపై సౌదన్ సింగ్ (40) అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంగతి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే, ఆమె గ్రామస్థులతో తన గోడు వెళ్లబోసుకుంది.
దీంతో ఆగ్రహించిన సౌదన్, దౌర్జన్యంగా ఇంట్లో ప్రవేశించి, ఆమె దుస్తులు చింపేశాడు. అంతటితో వదలక జుట్టుపట్టి వీధిలోకి ఈడ్చుకొచ్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సౌదన్‌ను అరెస్ట్ చేశారు. అతనిని కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు. గ్రామస్థులు ఆమెను రక్షించారు.












Click it and Unblock the Notifications