144 కేసులు.. 22 ఏళ్లు జైలు... భార్యతో కలిసి అరెస్ట్.. తప్పించుకొనే ప్రయత్నించి...

అతని వృత్తి, ప్రవృత్తి నేరాలే. భార్య, కుటుంబసభ్యులు కూడా నేరాలే చేస్తారు. వందల కేసులకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు 22 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన నేరస్థుడిని ఢిల్లీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నాడు. జోగిందర్ అలియాస్ జగ్గా.. సొంత సోదరుడి హత్య కేసులో కూడా భాగస్వామ్యం ఉందని పోలీసులు చెప్తున్నారు.

జోగిందర్ అలియాస్ జగ్గా.. వయస్సు 37 ఏళ్లే కానీ నేరాలు మాత్రం బోలేడు. తన వయస్సులో ఇప్పటికే 22 ఏళ్లు జైలు జీవితం గడిపాడంటే అతని నేర చరిత్ర ఏంటో అర్థమవుతుంది. 142 కేసులు నమోదు కాగా.. వాటిల్లో శిక్ష ఖరారైన కేసులకు సంబంధించి 22 ఏళ్లు జైలు జీవితం అనుభవించాడు. సొంత సోదరుడి హత్య కేసులో కూడా పాత్ర ఉందని పోలీసులు చెప్తున్నారు.

22 years in jail, 142 cases: Delhi Police arrest

ఆయా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగ్గా అతని భార్య పోలీసుల కళ్లు గప్పి పారిపోయారు. వారి కోసం ఎదురుచూస్తున్న పోలీసులు ఢిల్లీలోని సగార్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న జగ్గా.. తన భార్యతో కలిసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ అతని జాడను పోలీసులు కనుగొనడంతో పారిపోయాడు. చివరికి పోలీసులకు తన భార్యతో కలిసి చిక్కాడు. మరోవైపు జగ్గా కుటుంబసభ్యులంతా నేరచరిత్ర కలిగినవారని పోలీసులు చెప్తున్నారు. జగ్గాపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+