ఫేస్‌బుక్ షాకింగ్: పెళ్లి పేరుతో రప్పించి పలుమార్లు రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతిని ఢిల్లీకి ప్రేమ పేరుతో రప్పించి ఆమె పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపాడు. నిందితుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన 23 ఏళ్ల యువతి. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడి భార్య కూడా సదరు యువతిని వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడి పేరు అల్తాఫ్. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని భార్య ఉజ్బెకిస్తాన్ యువతిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం చేసినందున ఆమెను అరెస్టు చేశారు.

బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు... తనను అల్తాఫ్ పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పింది. అల్తాఫ్ తనను అతని భార్యకు పరిచయం చేశాడు. వారు తనను వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నాలు చేశారు.
ఉజ్బెకిస్తాన్ యువతికి అల్తాఫ్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఢిల్లీకి రప్పించాడు. ఆమె మే 6వ తేదీన తన దేశం నుంచి ఢిల్లీకి వచ్చింది.
ఆమె ఢిల్లీకి రాగానే ఓ హోటల్‌కు తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. దానిని వీడియోగా తీశాడు. ఆ తర్వాత నుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
అంతేకాదు, అల్తాఫ్ దంపతులు తన పాస్‌పోర్టు, వీసా, డబ్బులను కూడా తీసేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను గదిలో బంధించి కొట్టిన సందర్భాలున్నాయని చెప్పింది. హోటల్లో తన వద్దకు గెస్టులను (వ్యభిచారం నిమిత్తం) పంపించేవారని చెప్పింది.
అలా తనను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేశారని చెప్పింది. వారి నుంచి తప్పించుకొని వచ్చి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అల్తాఫ్ కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications