విషాదం: డ్యాన్ చేస్తూ కుప్పకూలిన యువతి, మృతి

గుర్గావ్: నృత్యం చేస్తూ ఓ యువతి మృతి చెందింది. ఈ విషాద ఘటన గుర్గావ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రముఖ అమెరికన్‌ స్టార్‌ స్క్రిలెక్స్‌ కార్యక్రమాన్ని గత ఆదివారం గుర్గావ్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఢిల్లీకి చెందిన అంచల్‌ అరోరా(23) తన స్నేహితులతో కలిసి వచ్చింది. అమెరికన్‌ స్టార్‌ స్క్రిలెక్స్‌ కార్యక్రమం కావడంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ కార్యక్రమంలో డ్యాన్స్‌ చేస్తూ అంచల్‌ అరోరా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

23-Year-Old Woman Dies While Dancing at Crowded Skrillex Concert in Gurgaon

వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్నేహితులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. అంచల్ డ్యాన్స్ కార్యక్రమానికి కొద్ది గంటల నుంచే ఎలాంటి ఆహారం గానీ, పానీయం గానీ తీసుకోలేదని తెలిపారు.

ప్రజలు ఎక్కువగా ఉండటంతో.. ఊపిరి ఆడక గుండెనొప్పితో మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలిందని పోలీసులు తెలిపారు. స్క్రిలెక్స్‌ కార్యక్రమం నిర్వహించిన స్థలంలో కేవలం 8వేల మంది మాత్రమే పట్టే అవకాశం ఉండగా.. మరో 2వేల మంది ఎక్కువగా హాజరవ్వడంతో ఈ విధంగా జరిగిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+