కాబోయే భార్యను రేప్ చేశాడు, గర్బవతి, ఎవరితో తిరిగావు, చేతులు ఎత్తేసిన వరుడు!

బెంగళూరు: కాబోయే భార్యను రేప్ చేసి ఆమెను గర్బవతిని చేసి చివరికి వరుడు చేతులు ఎత్తేసి ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఇంటిలో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో కత్తి చూపించి బెదిరించి అత్యాచారం చేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించాడు.

బెంగళూరులోని విజయనగర్ లో నివాసం ఉంటున్న 22 ఏళ్ల యువతికి, సురేష్ అనే వ్యక్తికి వివాహం నిశ్చయం అయ్యింది. వధూవరుడి కుటుంబ సభ్యులు బంధువులు అందరినీ పిలిచి నిశ్చితార్థం జరిపించారు. నిశ్చితార్థం అయిన తరువాత సురేష్ కాబోయే భార్య ఇంటికి వెళ్లి వస్తున్నాడు.

కావాలని అడిగాడు !

కావాలని అడిగాడు !

ఆ సందర్బంలో ఇంటిలో యువతి మాత్రమే ఒంటరిగా ఉంది. ఆమెను బలవంతంగా లొంగదీసుకోవడానికి సురేష్ ప్రయత్నించాడు. అయితే ఆమె పెళ్లి వరకు ఆగాలని చెప్పింది. అంతటితో సురేష్ వదిలిపెట్టలేదు. వంట గదిలోని కత్తి తీసుకువచ్చి యువతిని బెదిరించాడు.

పెళ్లికి ముందే తల్లిని చేశాడు

పెళ్లికి ముందే తల్లిని చేశాడు

కాబోయే భార్య మీద అత్యాచారం చేశాడు. ఇలా రెండు మూడు సార్లు ఆమె మీద అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే పెళ్లి చేసుకోనని, చంపేస్తానని యువతిని బెదిరించాడు. యువతి గర్బంతి అయ్యింది. తాను పెళ్లికి ముందే గర్బవతి అయ్యానని మీ ఇంటిలో తెలిస్తే కష్టం అని యువతి సురేష్ కు చెప్పింది.

ప్రైవేటు ఆసుపత్రిలో !

ప్రైవేటు ఆసుపత్రిలో !

అంతే కాబోయే భార్యను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ఆమెకు అబార్షన్ చేయించాడు. తరువాత నువ్వు ఎవ్వరితోనో తిరిగి కడుపు చేయించుకున్నావని, నేను నిన్ను పెళ్లి చేసుకోనని సురేష్ అడ్డం తిరిగాడు. యువతి ఎంత చెప్పినా అతను వినలేదు.

నీకు ఇలా చేస్తానే !

నీకు ఇలా చేస్తానే !

చివరికి విసిగిపోయిన యువతి తనకు జరిగిన అన్యాయంపై విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సురేష్ మీద అత్యాచారం చేశాడని, బలవంతంగా అబార్షన్ చేయించాడని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

అందరూ

అందరూ

యువతికి వైద్య పరీక్షలు చేయిస్తున్నామని, ఆమెకు అబార్షన్ చేసింది ఏ ఆసుపత్రిలో, వైద్యులు ఎవరు ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కాబోయే భార్యను గర్బవతిని చేసి అబార్షన్ చేయించిన సురేష్ ఇప్పుడు కటకటాలపాలు కావడానికి సిద్దం అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+