నగ్నంగా వీడియో తీశాడు, అత్యాచారం, ప్రేమ, పెళ్లి పేరుతో డ్రామా, భార్య, కాపురం!
బెంగళూరు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని నగ్నంగా వీడియోతీసి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత పెళ్లి చేసుకోనని ఎదురు తిరగడంతో బాధితురాలు బెంగళూరు నగర శివార్లలోని మాదనాయకనహళ్ళి పోలీసులను ఆశ్రయించింది.
బెంగళూరు నగర శివార్లలోని మాగడి తాలూకా కణనూరులో నివాసం ఉంటున్న విజయ్ కుమార్ అలియాస్ విజయ్ కి ఇంతకు ముందే పెళ్లి జరిగింది. విజయ్ కుమార్ నివాసం ఉంటున్న ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లిన 22 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానంటూ అతను వెంటపడ్డాడు.

పెళ్లి చేసుకుంటానని విజమ్ కుమార్ ఆమెను నమ్మించాడు. ఏకాంతంగా ఇద్దరూ గడిపిన సమయంలో యువతిని నగ్నంగా వీడి యో తీసి సోషల్ మీడియాలో పెడుతానని ఆమెను బెదిరించాడు. వీడియో చూపించి ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేశాడు.
రెండుసార్లు ఆమెకు అబార్షన్ కూడా చేయించాడని యువతి ఆరోపిస్తోంది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తే నువ్వు ఎవరో తెలియదని చెబుతున్నాడని యువతి ఆరోపిస్తోంది. ఏం చెయ్యాలో అర్థంకాక బాధితురాలు ఫిర్యాదు చేయ్యడంతో మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి విజయ్ కుమార్ కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications