పెళ్లి పేరు చెప్పి అమ్మాయిపై అమెరికా పైలట్ రేప్

న్యూఢిల్లీ: పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అమెరికా పైలట్ తనపై అత్యాచారం చేశాడని 26 ఏళ్ల మహిళ ఆరోపించింది. ఈ విషయాన్ని పోలీసులు వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇరువురికి తెలిసిన వ్యక్తి పైలట్‌ను తనకు పరిచయం చేశారని, ఆ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్నారని ఆ అమ్మాయి తన ఫిర్యాదులో తెలిపింది.

నాలుగేళ్ల క్రితం తమకు పరిచయం ఏర్పడిందని, స్నేహం కుదరగానే అతను తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, దాంతో ఇరువురి మధ్య లైంగిక సంబంధం ఏర్పడిందని, ఆ కారణంగా తాను గర్భవతిని అయ్యానని ఆమె చెప్పింది.

 26-year-old alleges rape by US pilot

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆ మహిళ - తాము సహజీవనం చేశామని, ఆ కారణంగా తమకు ఓ కూతురు కూడా పుట్టిందని చెప్పింది. పైలట్ ఉద్యోగం మారి సింగపూర్‌కు మారాడని ఆమె పోలీసులకు చెప్పింది. తాను అతన్ని సంప్రదించడానికి ప్రయత్నించి విఫలమైనట్లు తెలిపింది.

ఆ మహిళ ఫిర్యాదు మేరకు సఫ్దర్‌జంగ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ వ్యక్తి పనిచేస్తున్నాడని చెబుతున్న ఎయిర్‌లైన్స్‌ను పోలీసులు సంప్రదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+