షూటౌట్: పీయుసీ విద్యార్థిని గౌతమికి 78.66 శాతం మార్కులు
బెంగళూరు: అటెండర్ జరిపిన కాల్పులో మరణించిన పీయుసీ విద్యార్థిని గౌతమి ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యింది. సోమవారం పీయుసీ (ఇంటర్) పరిక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. పీయుసీ విద్యార్థిని గౌతమికి 78.66 శాతం మార్కలు వచ్చాయి. విషయం తెలుసుకున్న గౌతమి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
బెంగళూరు నగరంలోని కాడుగోడిలో ఉన్న ప్రగతి పీయుసీ కాలేజ్ లో గౌతమి (18) పీయుసీ విద్యాభ్యాసం చేస్తున్నది. తుమకూరు జిల్లాకు చెందిన గౌతమి పరిక్షలు పూర్తి అయిన తర్వాత ఉన్నత చదువులు చదవడానికి కాలేజ్ హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంది.

అదే కాలేజ్ లో అటెండర్ గా పని చేస్తున్న మహేష్... గౌతమి, ఆమె స్నేహితురాలు, అదే కాలేజ్ విద్యార్థిని శిరీష మీద కక్ష పెంచుకున్నాడు. 2015 మార్చి 31వ తేదిన రాత్రి 10.15 గంటల సమయంలో మహేష్ హాస్టల్ లోని గౌతమి గది దగ్గరకు వెళ్లాడు.
రివాల్వర్ తీసుకుని గౌతమి, శిరీష మీద కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలైన గౌతమి సంఘటనా స్థలంలో మరణించింది. తీవ్రగాయాలైన శిరీష ఆసుపత్రిలో చికిత్స పోంది కోలుకునింది. మహేష్ ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు.












Click it and Unblock the Notifications