టీటీవీ కొత్త పార్టీ, అప్పుడే ఎదురుదెబ్బ, పదవులు నిరాకరించిన ఎమ్మెల్యేలు, నువ్వు వద్దు నీ !

అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని ఎమ్మెల్యేలలో చీలిక తీసుకు వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిని ముప్పుతిప్పలు పెట్టాలని ప్రయత్నిస్తున్న శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్.

చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని ఎమ్మెల్యేలలో చీలిక తీసుకు వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిని ముప్పుతిప్పలు పెట్టాలని ప్రయత్నిస్తున్న శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ కు అప్పుడు ఎదురు దెబ్బ తగిలింది.

అన్నాడీఎంకే లో ఎమ్మెల్యేల్లో చీలిక తీసువచ్చి కొత్త పార్టీ పెట్టిన టీటీవీ దినకరన్ సొంత వర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. మీరు కొత్తగా మాకు ఏ పదవులు ఇవ్వనవసరం లేదని, అమ్మ జయలలిత ఎప్పుడో మాకు పదవులు ఇచ్చారని గట్టి షాక్ ఇచ్చారు.

 3 AIADMK MLAs have rejected the party posts given by TTV Dinakran.

శుక్రవారం రాత్రి అన్నాడీఎంకే పురట్చి తలైవీ అమ్మ పేరవై పేరుతో కొత్త పార్టీ పెట్టిన టీటీవీ దినకరన్ ముగ్గురు మాజీ మంత్రులు ( సిట్టింగ్ ఎమ్మెల్యేలు)తో పాటు 15 మంది ఎమ్మెల్యేలతో సహ 64 మంది కీలకపదవులు కట్టబెట్టి ఎడప్పాడి పళనిసామిని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించారు.

అయితే అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని ఎమ్మెల్యేలు పళని, సత్యా పన్నీర్ సెల్వం, ఏకే. బోస్ టీటీవీ దినకరన్ కు షాక్ ఇచ్చారు. జయలలిత తమకు ఎప్పుడో పదవులు ఇచ్చారని, అమ్మ ఆశీస్సులతో తాము ఎమ్మెల్యేలు అయ్యామని, కొత్తగా ఇప్పుడు మీరు మాకు ఎలాంటి పదవులు ఇచ్చినా తీసుకోవడానికి సిద్దంగా లేమని శనివారం తేల్చి చెప్పడంతో టీటీవీ దినకరన్ షాక్ కు గురైనాడు. నువ్వు వద్దు నీ పదవులు వద్దు అంటూ టీటీవీ దినకరన్ కు దండం పెట్టేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+