జోధ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురి అరెస్ట్
రాజస్థాన్ జోధ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. సుర్సాగర్ చెక్ పాయింట్ వద్ద గల రుపావటొ కా బెరా వద్ద ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఘర్షణలో మరికొందరికీ స్వల్పంగా గాయాలు అయ్యాయి. తొలుత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదీ కాస్త పెరిగి పెద్దది అయిపోయింది. జనం చేరుకొని.. రెండు వర్గాలుగా చీలిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే పోలీసులు జనాలను చెదరగొట్టారు. పరిస్థితిని తమ అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఇటు కాన్పూర్ ఘర్షణ కూడా చినికి చినికి గాలి వానలా మారింది.












Click it and Unblock the Notifications