ప్రేమ పేరుతో యువతిని నమ్మించిన నీచుడు ఏం చేశాడో చూడండి, వైరల్, చివరికి !

బెంగళూరు: ప్రేమ పేరుతో యువతిని నమ్మించి ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె నగ్నఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆమె జీవితంతో చెలగాటం ఆడిన ప్రియుడితో పాటు అతని ఇద్దరు స్నేహితులను కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఉప్పనంగడి పోలీసులు అరెస్టు చేశారు.

దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పనంగడిలో నివాసం ఉంటున్న సందేష్ అనే యువకుడు ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. సందేష్ ఒక యువతిని పరిచయం చేసుకుని ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తరువాత ఆమెతో చనువుగా ఉన్నాడు.

3 arrested for uploading young girls objectionable picture on social media in Karnataka

యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో ఏకాతంగా గడిపాడు. ఆ సమయంలో రహస్యంగా యువతి నగ్నచిత్రాలు తీశాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి సందేష్ కు దూరం అయ్యింది. తాను చెప్పినట్లు వినాలని సందేష్ ఆమెను వేధింపులకు గురి చేశాడు.

యువతి మాత్రం సందేష్ కు దగ్గర కావడానికి నిరాకరించింది. ఈ విషయంపై కక్ష పెంచుకున్న సందేష్ యువతి నగ్న ఫోటోలను స్నేహితులు జగదీష్, నవీన్ మొబైల్ ఫోన్లకు పంపించాడు. ఇద్దరు యువకులు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

యువతి నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో ఆమె స్నేహితులు చూశారు. యువతి స్నేహితులు ఆమెకు నగ్న ఫోటోల విషయం చెప్పారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో ఉప్పనంగడి పోలీసులు సందేష్, జగదీష్, నవీన్ అనే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+