స్నేహితుడి 'ఫోన్'లో భార్య శృంగార వీడియో?: హత్య, కోర్టు తీర్పు ఆశ్చర్యం..

అబుదాబీ: శిక్షల విషయంలో ప్రపంచ దేశాలన్నింటికి భిన్నంగా వ్యవహరించే సౌదీ కోర్టులు.. తాజాగా ఓ హత్య కేసు విషయంలోను భిన్నమైన తీర్పును వెలువరించాయి. హత్య చేసిన వ్యక్తికి శిక్ష విధించకుండా.. అలా ప్రేరేపించబడటానికి కారణమైన మహిళలకు కోర్టు శిక్ష విధించింది. అబుదాబీలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. స్నేహితుడే మరో స్నేహితుడిని హత్య చేయడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు వ్యాపార భాగస్వాములు.. 15ఏళ్ల క్రితం అబుదాబీలో ఒక రెస్టారెంటు ప్రారంభించారు. వీరిద్దరు ఫిలిప్పీన్స్‌కు చెందిన యువతులను వివాహం చేసుకుని, ఒకే ఫ్లాటులో ఉంటున్నారు. ఇన్నేళ్ల స్నేహంలో వీరి మధ్య ఎప్పుడూ విభేదాలు తలెత్తలేదు.

3 Asians jailed in UAE for adultery, sharing lewd videos

అయితే గతేడాది అక్టోబర్‌లో తన స్నేహితుడి ఫోన్ లో చూడకూడదని దృశ్యమొకటి మరో స్నేహితుడి కంటపడింది. తన భార్యతో అతను శృంగారంలో పాల్గొన్న నాలుగైదు వీడియోలో అందులో కనిపించాయి. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన అతను స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. మెడపై, కన్ను మీద, శరీరంలోని పలు భాగాల్లో కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశాడు.

ఆపై అంబులెన్స్ కు ఫోన్ చేసి విషయం చెప్పగా.. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదవగా.. విచారించిన కోర్టు భార్యదే తప్పని తేల్చింది. బాధితుడి భార్య, నిందితుడు భార్య ఇద్దరూ అశ్లీల వీడియోలను షేర్ కూడా చేసుకున్నట్లు చెప్పింది. దీంతో వీరిద్దరికి మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. అసలు నిందితుడికి మాత్రం ఎలాంటి శిక్ష విధించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+