అసోంలో పోలీసుల కాల్పులు ముగ్గురు మృతి

అసోం ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. నిరసనలు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే గురువారం పోలీసులు గౌహతీలో కాల్పులు జరిపారు. కాగా ఈ కాల్పుల్లో మొత్తం ముగ్గురు పౌరులు మృతి చెందగా పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది....మొత్తం కాల్పుల్లో నలుగురు గాయపడగా వారిని చికిత్స కోసం గౌహతి మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డట్టు అధికారులు తెలిపారు. అయితే మృతుల పేర్లను బయటపెట్టేందుకు మాత్రం అధికారులు నిరాకరించారు.

అసోంలో నిరసలు

అసోంలో నిరసలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై అసోంలో నిరసనలు మిన్నంటాయి. బిల్లును వ్యతిరేకిస్తూ.. ప్రజలు రోడ్లపైకి వచ్చి మూడు రోజులుగా అందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కర్ఫూ విధించినా.. లెక్క చేయని ప్రజలు పలు వాహానాలతోపాటు రైల్వే స్టేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సైతం నిప్పు పెట్టారు.

ఇక బిల్లుకు ప్రధాన కారణమైన అధికార పార్టీ సీఎం ఇంటితో పాటు, ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల ఇంటిపై రాళ్లు రువ్వారు.

బీజేపీ, ఏజీపీ కార్యాలయాలకు నిప్పు

బీజేపీ, ఏజీపీ కార్యాలయాలకు నిప్పు

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని లక్ష్మిపూర్‌ జిల్లాతో పాటు మరో జిల్లాలో బీజేపీ, అసోం గణపరిషత్ పార్టీ కార్యాలయాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. మరోవైపు బీజేపీ చబువా ఎమ్మెల్యే ఇంటికి సైతం నిప్పుపెట్టారు. అంతకు ముందు అసోం సీఎం ఇంటిపై రాళ్లు సైతం రువ్వారు. దీంతో నిరసనలను అదుపులోకి తీసుకువచ్చేందు కేంద్ర భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూను విధించారు. అయినా... అందోళనలు ఆగకపోవడంతో గుహవటిలోని కొన్ని ప్రాంతాల్లో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో పలు చోట్ల పౌరులకు గాయాలు అయ్యాయి.

మీడియాపై అంక్షలు

మీడియాపై అంక్షలు

మరోవైపు కేంద్రం మీడియాపై కూడ అంక్షలు విధించింది. నిరసన కారులు చేస్తున్న ఆందోళనలపై అంత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర సమాచార శాఖ పలు మీడియా సంస్థలను కోరింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. దేశ వ్యతిరేక వైఖరిని ప్రోత్సహించే అంశాలను ప్రసారం చేయకూడదని , ఇలాంటీ సమయంలో జగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+