భారీ ఎన్‌కౌంటర్: హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి దెబ్బ

దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానికంగా ఈ ఉగ్రమూకలకు గట్టి నెట్ వర్క్ ఉన్నప్పటికీ బుధవారం రాత్రి సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసు బలగాలు భారీ ఎన్‌

శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానికంగా ఈ ఉగ్రమూకలకు గట్టి నెట్ వర్క్ ఉన్నప్పటికీ బుధవారం రాత్రి సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసు బలగాలు భారీ ఎన్‌కౌంటర్ జరిపాయి.

ఆరు గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో ఓ సైనికాధికారికి గాయాలయ్యాయి.

3 Lashkar Terrorists Killed, Army Officer Injured In Gunbattle In South Kashmir's

పుల్వామాలోని కాకపొరా ప్రాంతంలో ముగ్గురు యువకులు లష్కరే తోయిబాలో చేరినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో భద్రతా దళాలు, పోలీసులు బుధవారం సాయంత్రం సంయుక్తంగా గాలింపు మొదలుపెట్టారు.

అత్యంత జనసమ్మర్దం గల ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కినట్టు గుర్తించారు. భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఎట్టకేలకు సైనికులు గురువారం తెల్లవారుజామున ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే 47, ఓ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టు సీఆర్పీఎఫ్ అధికారి తెలిపారు. కాగా మూడు రోజుల్లో హిజ్బుల్ ఉగ్రవాదులపై సైన్యం ఆపరేషన్ విజయవంతం కావడం ఇది రెండోసారి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+