పెళ్లి బట్టలు తీసుకుని వస్తూ వధువు సహా తల్లిదండ్రులు మృతి
బెంగళూరు: పెళ్లి బట్టలు తీసుకు వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమార్తెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు దుర్మరణం చెందారు. పెళ్లి బట్టలు మొత్తం రక్తపుమరకలు అయ్యి రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి.
చిక్కమగళూరులో కృష్ణప్ప (60), శారదమ్మ (48) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె లావణ్య (26). లావణ్య వివాహం నిశ్చయం అయ్యింది. మే 16వ తేదిన చిక్కమగళూరులో వైభవంగా లావణ్య వివాహం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటివల కృష్ణప్ప, శారదమ్మ దంపతులు కుమార్తె లావణ్యను పిలుచుకుని బెంగళూరు వచ్చారు. బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న బంధువులకు వివాహ పత్రికలు పంచిపెట్టారు. పెళ్లికి కావాలసిన పట్టుచీరలు, బట్టలు తీసుకున్నారు. సోమవారం రాత్రి కారులో చిక్కమగళూరు బయలుదేరారు.

మార్గం మద్యలో మంగళవారం వేకువ జామున 2 గంటల సమయంలో మూడిగెరె తాలుకా గోణిబీడు సమీపంలో మంగళూరు నుండి బెంగళూరు వైపు వెళుతున్న కేఎస్ఆర్ టీసీ బస్సు వీరి కారును డీకొనింది. ఈ ప్రమాదంలో కృష్ణప్ప, శారదమ్మ దంపతులతో పాటు పెళ్లి కుమార్తె లావణ్య సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు.
కారు డ్రైవర్ సందీప్ కు తీవ్రగాయాలు కావడంతో మూడిగెరె ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బనకల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పెళ్లి కుమార్తెతో పాటు ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం చెందడంతో విషాదఛాయలు నెలకొన్నాయి. బస్సు డ్రైవర్ బసవరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications