వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగ్రా గ్యాంగ్ రేప్, వీడియో చిత్రీకరణ: ముగ్గురు రేపిస్టులూ మైనర్లే

By Pratap
|
Google Oneindia TeluguNews

ఆగ్రా: మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులు కూడా మైనర్ బాలురే. వారు మైనర్ బాలికపై అత్యాచారం చేసి, దాన్ని చిత్రీకరించి, వీడియోను వాట్సప్‌లో అప్‌లోడ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచార సంఘటన ఆగ్రా నగరంలో ఆందోళనకు దారి తీసింది.

అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు బాలురు కూడా 14, 16 ఏళ్ల మధ్య వయస్సు గలవారేనని పోలీసులు చెప్పారు. బాధితురాలు వారి పక్కనే నివాసం ఉంటుంది. ఆమె ఏత్మాదౌలాలోని 15 ఏళ్ల బాలిక. ఈ అత్యాచార సంగటన జనవరి 15వ తేదీన జరిగింది. తనను నిందితులు బెదిరించడంతో బాలిక ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే, వీడియో వెలుగు చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

3 rapists of minor girl were minors too: Agra cops

ముగ్గురు నిందితులను కూడా జువెనైల్ రిఫార్మ్ హోంకు పంపించారు. సంఘటన గురించి తమకు తెలిసిన రోజే పోలీసులు నిందింతులందరినీ అరెస్టు చేశఆరు. ఇంతకు ముందు కూడా వారిపై ఇతర కేసులు నమోదై ఉన్నాయి. ఇంటర్నెట్‌లో వీడియో పంపిణీ అవుతున్న విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తమ తల్లిదండ్రులు పనికి పోవడం, తన సోదురుడు పాఠశాలకు వెళ్లడం గమనించిన ఆ ముగ్గురు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక చెప్పింది.

English summary
Three of those accused of the gang-rape of a minor girl in Agra, who later also uploaded a video of their crime on Whatsapp, were minors too, police said. The incident had triggered protests across the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X