నాగా దంపతులపై దాడి: టెక్కీలు, జిమ్ ఓనర్ అరెస్ట్
బెంగళూర్: నాగాలాండ్ దంపతులపై ఉత్తర బెంగళూర్‌లోని నృత్యగ్రామ్ వద్ద దాడి చేసిన సంఘటనలో పోలీసులు ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను, ఓ జిమ్ యజమానిని అరెస్టు చేశారు. శనివారంనాడు నాగాలాండ్ దంపతులపై దాడి జరిగింది.
హరీష్ (27), మహేష్ (27), రతన్ (31), అనంత్ (30) నాగాలాండ్ దంపతులపై దాడి చేసినట్లు, నాగాలాండ్ దంపతులు వారిని రెచ్చగొట్టిన దాఖలాలు కూడా లేవని పోలీసులు అన్నారు. దాడి జరిగిన సమయంలో బాధితుడు తమపై దాడి చేసినవారు ప్రయాణించిన రెనౌల్ట్ డస్టర్ నెంబర్‌ను నోట్ చేసుకున్నాడు.
పోలీసులు బాధితుడు ఇచ్చిన నెంబర్ ఆధారంగా దక్షిణ బెంగళూర్‌లోని తలఘట్టపురలో వాహనాన్ని గుర్తించారు. ఈ ప్రాంతం దాడి జరిగిన ప్రాంతానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిందితులు హరీష్, మహేష్, అనంత్ ఎలక్ట్రానిక్ సిటీలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండగా రతన వైట్‌ఫీల్డ్‌లో జిమ్ నడుపుతున్నాడు. వారు తలఘట్టపురాలో నివాసం ఉంటున్నారు.

సంఘటన శనివారంనాడు మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. గత పదేళ్లుగా బాధితుడు బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాడు. అతను శనివారంనాడు భార్యతో కలిసి హెస్సార్‌ఘట్టలోని నృత్యగ్రామ్ డ్యాన్స్ గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో మహిళ కారు నడిపింది. అక్కడి నుంచి వెళ్లిపోదామని చూడగా తమ కారు టైరులో గాలి లేకపోవడం వారు గమనించారు.
టైర్‌ను మారుస్తుండగా నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఇద్దరు వ్యక్తులు వారిపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. మీరు ఇండియావాళ్లు కారు, ఇక్కడేం చేస్తున్నారు, ఇక్కడెందుకు డ్రైవ్ చేస్తున్నారంటూ దబాయించారు. దంపతులు వారిని పట్టించుకోలేదు. దాంతో వారు మహిళ చేతులోని గొడుగును లాక్కున్నారు. ఇద్దరు వ్యక్తులు పురుషుడిని, అతని భార్యను బాదడం ప్రారంభించారు. తనను కొడుతుండగా తన భార్య అడ్డం వచ్చిందని, దీంతో తన భార్యను కూడా కొట్టారని, ఆ తర్వాత మరో ఇద్దరు ఈ ఇద్దరు వ్యక్తులను కారులోకి లాక్కుని అక్కడి నుంచి పారిపోయారని బాధితుడు చెప్పాడు.
మహిళ రాష్ డ్రైవింగ్ చేయడంతో గొడవ జరిగిందని నిందితులు వాదిస్తున్నారు. దీన్ని తాము పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications