మరో దారుణం: బెంగళూరు పాఠశాలలో బాలికపై లైంగిక దాడి
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని పాఠశాలల్లో పరిస్థితులు అంత సజావుగా లేనట్లు కనిపిస్తోంది. మరో పాఠశాలలో దారుణం జరిగింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో మూడున్నరేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. రెండు సార్లు తమ కూతురిపై దుష్ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలు జరిగాయని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, ఆ సంఘటనలో నిందితుడిని పోలీసులు మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బెంగళూరులోని ఓ పాఠశాలలో అక్టోబర్‌లో మూడున్నరేళ్ల బాలికపై ఆఫీస్ అసిస్టెంట్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అక్టోబర్ 22వ తేదీన తల్లి పాఠశాల నుంచి తీసుకుని వెళ్తున్నప్పుడు బాలిక ఏడుపు ప్రారంభించింది. బాలిక సాధారణ స్థితిలో ప్రవర్తించకపోవడం గమనించారు. జ్వరం కూడా వచ్చింది. తనను కొట్టారంటూ మొదట బాలిక తల్లికి చెప్పింది. తనపై లైంగిక దాడి జరిగిందని ఆ తర్వాత చెప్పినట్లు తల్లిదండ్రులు చెప్పారు. ఆ బాలిక పాఠశాలలో నర్సరీ చదువుతోంది.
బెంగళూరులో ఇటువంటి సంఘటన నమోదు కావడం ఇది నాలుగోది. అక్టోబర్‌లో మొదటిసారి బాలికపై లైంగిక దాడి జరిగినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications