రూ.200 బాకీ 30 ఏళ్ల తర్వాత తీర్చాడు.. ఎంత ఇచ్చాడో తెలుసా..?
ముంబై : మంచికి రోజులు లేవు. చేసిన మంచిని గుర్తుంచుకోవడం లేదు. అప్పు తీసుకొని మరచిపోతున్నారు. తిరిగి అడిగినా ఇవ్వని రోజులివి. కానీ కెన్యా ఎంపీ మాత్రం అలా కాదు. తాను తీసుకున్న రూ.200కు వందింతలు ఇచ్చేశారు. అయితే ఒకటి కాదు రెండు కాదు ముప్ఫై ఏళ్ల తర్వాత తన రుణం తీర్చడంతో .. అంత పెద్ద మొత్తంలో ఇచ్చేశాడు.

వేధించిన అప్పు ..
రిచర్డ్స్ న్యాగక టోంగీ కెన్యా ఎంపీ, విదేశీ వ్యవహారాల సమితి అధ్యక్షుడు కూడా. ఇప్పుడు కెన్యాలో మంచి స్థాయిలో ఉన్నారు. అయితే ఆయన చదువుకుంది మాత్రం ఔరంగబాద్‌లో. 1985 నుంచి 1989 వరకు మౌలానా ఆజాద్ కాలేజీలో చదువుకున్నారు. అప్పుడు సాధారణ పౌరుడిలా ఒక గదిలో అద్దుకు ఉంటూ చదువుకొన్నారు. రూమ్ దగ్గరలో ఉన్న కిరాణా షాపులో సరుకులు తెచ్చుకునేవారు. అలా ఒకసారి రూ.200 సరుకులు అప్పుగా తీసుకున్నారు. కానీ అనుకోకుండా కెన్యా రావల్సి వచ్చింది. దీంతో చేసిన అప్పు తీర్చలేకపోయారు.

కెన్యాకే పరిమతం ...
కెన్యా వచ్చిన రిచర్డ్స్ .. తిరిగి ఇండియా రాలేదు. కానీ చేసిన అప్పు మాత్రం ఆయనను వెంటాడింది. తర్వాత రాజకీయాల్లోకి రావడం, ఎంపీగా గెలవడం జరిగిపోయాయి. ఈ క్రమంలో ఇటీవల కెన్యా ప్రతినిధి బృందం ప్రధాని మోడీని కలిసేందుకు భారత్ వచ్చింది. అందులో రిచర్డ్స్ కూడా ఉన్నారు. మోడీతో సమావేశం తర్వాత ఆయన ఔరంగాబాద్ చేరుకున్నారు. తాను అప్పు చేసిన వ్యాపారి అడ్రస్ వెతికారు. తాను 30 ఏళ్ల క్రితం చేసిన రూ.200 అప్పుకు బదులుగా 250 యూరోలు ఇచ్చారు. అంటే మన కరెన్సీలో 19 వేల 200 రూపాయలు. ఈ సందర్భంగా పాత స్మృతులను గుర్తుచేసుకున్నారు.
ఆశ్చర్యం ....
30 ఏళ్ల క్రితం రూ.200 అంటే పెద్దమొత్తమే. దానిని తాను ఇవ్వలేకపోయానని రిచర్డ్స్ మదనపడ్డారు. చాలారోజుల తర్వాత ఇండియాకు వచ్చారు. తాను చేసిన అప్పు గుర్తొచ్చి .. ఔరంగాబాద్ చేరుకున్నారు. ఆ కిరాణా షాపు వ్యక్తిని కనుగొన్ని మరీ తన బాకీని ముట్టజెప్పారు. తాను ఇవ్వని రూ.200కు బదులుగా రూ.20 వేల నగదు ఇవ్వడంపై షాపు యాజమాని సంబర పడిపోయారు. గుర్తుంచుకొని మరీ తనను వెతికి ఇవ్వడంతో ఎంపీది ఎంతో గొప్ప మనసు అర్థం అవుతుందన్నారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications