ఖాతాలో డబ్బు లేకున్నా రూ.150 కోట్లు ఇవ్వాలని, షాకిచ్చిన బ్యాంకు సిబ్బంది
లక్నో:ఖాతాలో డబ్బు లేకున్నా రూ.150 కోట్లు డ్రా చేస్తానని గోనెసంచులతో బ్యాంకుకు ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. ఈ డబ్బును డ్రా చేసేందుకు అవసరమైన రక్షణ కల్పించాలని కూడ ఆయన పోలీసులను కూడ కోరాడు. అయితే చివరకు బ్యాంకులో హడావుడి చేసిన వ్యక్తికి మతిస్థిమితం సరిగాలేదని తెలిసి బ్యాంకు సిబ్బంది నిర్ఘాంతపోయారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని హపూర్‌కు చెందిన మంగళ్ సింగ్ అనే వ్యక్తి బ్యాంక్స్ గఢ్‌రోడ్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో హల్‌చల్ చేశాడు.తన ఖాతాలో నుంచి తనకు రూ.150కోట్లు విత్‌డ్రా చేసి ఇవ్వాల్సిందిగా బ్యాంకు సిబ్బందిని కోరాడు.
అయితే అతని ఖాతాలో ఎంత డబ్బుందో కనీసం బ్యాంకు సిబ్బంది చూడలేదు. కానీ, ఆ డబ్బును డ్రా చేసేందుకు అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని మంగల్ సింగ్‌కు బ్యాంకు అధికారులు సూచించారు.

ఈ విషయాన్ని బ్యాకు మేనేజర్‌కు క్యాషియర్ చెప్పాడు.అయితే మంగల్ సింగ్ ఖాతాలో కనీస నిల్వ నగదు కూడ లేదు. అంతేకాదు 2016 నుండి ఆ ఖాతా నిర్వహణలో కూడ లేదు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బ్యాంకు నుండి పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేస్తున్నానని తనకు రక్షణ కల్పించాలని మంగల్ సింగ్ అంతకుముందు రోజే పోలీసులను కోరాడు. బ్యాంకు వద్ద మంగల్ సింగ్ ను చూసిన పోలీసులు నిర్ఘాంతపోయారు.
కొన్ని రోజులుగా మంగల్ సింగ్ మానసిక పరిస్థితి సరిగా లేదని కుటుంబసభ్యులు పోలీసులకు వివరించారు. ఈ విషయాన్ని ధృవీకరించుకొన్న తర్వాత పోలీసులు ఆయనను వదిలేశారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications