ట్రిపుల్ తలాక్ ఫస్ట్ కేసు.. వాట్సాప్‌లో భర్త తలాక్, కేసు నమోదుచేసిన ముంబ్ర పోలీసులు

ముంబై : ట్రిపుల్ తలాక్‌తో ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందని చట్టం తీసుకొచ్చిన .. కొందరు భర్తల తీరు మాత్రం మారడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా తలాక్ చెబితే జైళ్లో పెడతామని ప్రభుత్వం హెచ్చరిస్తున్న చెవికెక్కించుకోవడం లేదు. తాజాగా మహారాష్ట్రలో ఓ భర్త తన భార్యకు తలాక్ చెప్పేశాడు. అదీ కూడా వాట్సాప్‌‌లో చెప్పడంతో స్రీన్ షాట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి వచ్చిన తొలి కేసు ఇదేనని పోలీసు అధికారులు చెప్తున్నారు.

వాట్సాప్‌లో తలాక్

వాట్సాప్‌లో తలాక్

ముంబైలోని ముంబ్ర పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఓ మహిళ ఎంబీఏ చేశారు. అయితే మొదటి భర్తతో విడిపోయి ఉంటున్నారు. 2015 సెప్టెంబర్ 7న మరోకరిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయినప్పటి నుంచే భర్త, అత్తమామలు, ఆడపడుచుల నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. కట్నం తీసుకురావాలని హరస్ చేసేవారు. దీంతో ఆ వేధింపులను రెండేళ్లపాటు భరించి .. చివరికి 2017లో తన తండ్రి వద్దకెళ్లిపోయింది. తర్వాత పెద్దలు సర్దిచెప్పి కాపురానికి పంపించారు. టూ వీలర్ కొనివ్వాలని పట్టుబడటంతో యువతి తండ్రి లోన్ తీసుకొని మరీ కొనిచ్చాడు. అయినా అతను మారలేదు. వేధింపులు ఆపలేదు. తర్వాత ఆమెకు తెలిసింది అతను అతను మరోకరితో వివాహేతర సంబంధం పెట్టున్నాడు. కానీ అప్పటికే ఆమె గర్భవతి అని పోలీసులు వివరించారు. దీంతో ఒకరికి తల్లి అయిన ఆమె భర్తతో వివాహేతర సంబంధంపై పోరాడుతూనే ఉంది.

వాట్సాప్‌లో పోరాటం

వాట్సాప్‌లో పోరాటం

అప్పటినుంచి వారి మధ్య వాట్సాప్‌లో కూడా పోరాటం జరుగుతుంది. వివాహేతర సంబంధం మానుకోవాలని ఆమె, కొనసాగిస్తానని ఆయన మధ్య చాటింగ్ జరిగింది. అయితే ఇటీవల విసుగుపొందిన భర్త గురువారం రాత్రి 9.30 గంటలకు వాట్సాప్‌లోనే తలాక్ చెప్పాడు. అయితే ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి వచ్చిన చెప్పడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తనకు వాట్సాప్‌లో తలాక్ చెప్పాడని పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. స్కీన్ షాట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తలాక్ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఇదేకాదు 2018 నవంబర్ 30న కూడా ఆమెకు తలాక్ చెప్పాడని ఫిర్యాదు చేసింది.

అమల్లోకి తలాక్

అమల్లోకి తలాక్

మంగళవారం ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో ఎట్టకేలకు తలాక్ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ విడుదలతో దేశవ్యాప్తంగా కొత్తచట్టం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత అధికారికంగా మహారాష్ట్రలో తొలి కేసు నమోదైంది. తలాక్ చట్టం ప్రకారం సదరు భర్తకు మూడేళ్ల వరకు బెయిల్ లభించదు. అతను కోర్టులో కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండని విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+