కరోనా కల్లోలం: 24 గంటల్లో 39 వేల కేసులు.. 491 మంది మృతి
దేశంలో కరోనా కేసుల పెరుగుతూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ దృష్ట్యా.. కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో 39 వేల 70 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3, 19, 34, 455కి చేరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ సోకిన 491 మంది చనిపోయారు. దీంతో కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 4,27,862కి చేరింది.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,06,822కి చేరింది. కరోనా వైరస్ తగ్గడంతో 43,910 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వైరస్ కేసుల శాతం 1.27గా ఉంది. రికవరీ రేటు 97.39 శాతంగా ఉంది. మరణాల శాతం 1.34గా ఉంది. దేశంలో వ్యాక్సిన్ డోసుల సంఖ్య 50.68 కోట్లు దాటింది. గత 24 గంటల్లో 55,91,657 మంది టీకా తీసుకున్నారు.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.
-
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications