కంటతడి పెట్టిన స్టార్ హీరో - ఓదార్చిన సాయిపల్లవి (వీడియో)..!!

దక్షిణాది వెండితెరపై తన సహజ నటనతో, అద్భుతమైన డాన్సులతో 'లేడీ పవర్ స్టార్'గా ఎదిగిన సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ సామ్రాజ్యాన్ని ఏలడానికి సిద్ధమైంది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో కలిసి ఆమె నటించిన 'ఏక్ దిన్' (Ek Din) చిత్రం ద్వారా హిందీ తెరకు పరిచయం కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ముంబైలో జరిగిన ఒక వేడుక అందరినీ కంటతడి పెట్టించింది.

చిత్ర పరిశ్రమలో 'మిస్టర్ పర్ఫెక్ట్'గా పేరుగాంచిన అమీర్ ఖాన్ సాధారణంగా భావోద్వేగాలను బయటకు చూపరు. కానీ, తన కుమారుడు జునైద్ ఖాన్ తొలి సినిమా చూసి ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ముంబైలోని ఎస్ఎన్డీటీ (SNDT) కాలేజీలో నిర్వహించిన "ఏక్ దిన్ కి మెహఫిల్" అనే మ్యూజికల్ ఈవెంట్‌లో ఈ అపూర్వ దృశ్యం చోటుచేసుకుంది.

aamir-khan-in-tears-after-watching-scenes-from-ek-din-movie-praises-sai-pallavi-video-goes-viral

కంటతడి పెట్టిన అమీర్.. ఓదార్చిన సాయి పల్లవి

ఈ వేడుకలో సినిమాలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలను ప్రదర్శించారు. తెరపై తన కొడుకు జునైద్ నటనను చూస్తూ అమీర్ ఖాన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆయన కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతుండగా, పక్కనే ఉన్న సాయి పల్లవి ఆయనను సున్నితంగా ఓదారుస్తూ కనిపించింది. ఆ తర్వాత వేదికపైకి వచ్చిన అమీర్, సాయి పల్లవిపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రస్తుతం మన దేశంలోనే అత్యుత్తమ నటి సాయి పల్లవి అని అమీర్ తేల్చేశారు.ఆమె ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ప్రశంసలు కురింపించారు.

థాయ్ రీమేక్.. జపాన్ అందాలు

2016లో విడుదలైన సూపర్ హిట్ థాయ్ చిత్రం 'వన్ డే' (One Day) కి ఇది అధికారిక రీమేక్. ఒక సున్నితమైన, విభిన్నమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కింది.ఇందులో సాయి పల్లవి 'మీరా' అనే ఉత్సాహవంతురాలైన అమ్మాయిగా కనిపిస్తుండగా, జునైద్ ఖాన్ 'డినో' అనే కాస్త అమాయకమైన, ఒంటరిగా ఉండే యువకుడి పాత్రలో నటిస్తున్నాడు.సినిమా ప్రధాన భాగం జపాన్‌లోని అద్భుతమైన ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. ముఖ్యంగా అక్కడి ప్రసిద్ధ 'సప్పోరో స్నో ఫెస్టివల్' నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

మే 1న విడుదల.. తెలుగులో కూడా?

సునీల్ పాండే దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌పై నిర్మితమైన ఈ చిత్రం 2026 మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ సంపత్ అందించిన సంగీతం ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రమోషన్ కంటెంట్ కూడా విడుదల కావడంతో, హిందీతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దక్షిణాదిలో ఇప్పటికే అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న సాయి పల్లవి, 'రామాయణ' వంటి భారీ ప్రాజెక్టుల కంటే ముందే 'ఏక్ దిన్'తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఆమె సహజ సిద్ధమైన నటనకు అమీర్ ఖాన్ వంటి దిగ్గజమే ఫిదా అయ్యారంటే, బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సాయి పల్లవి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+