హిమాచల్‌లో భూకంపం: పరుగులు తీసిన జనం
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం భూకంపం సంభవించింది. రెక్టారు స్కేలుపై 4.2తీవ్రతతో ఈ భూకంపం చోటు చేసుకుంది. కిన్నౌర్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో పలు సెకన్లపాటు భూమి కంపించింది.

భూకంప కేంద్రం హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రాజధాని షిమ్లా పరిసరాల్లో ఉందని గుర్తించారు. భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలు ఒక్కసారిగా బయటపికి పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
మే 9న ఢిల్లీ-ఎన్సీఆర్, కాశ్మీర్‌లలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీని తీవ్రత 6.2గా నమోదైంది. ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లలో కూడా ఇదే సమయంలో భూకంపం సంభవించింది.












Click it and Unblock the Notifications