కులాంతర వివాహం చేసుకున్నందుకు 40 మందికి శిరోముండనం, గ్రామ బహిష్కరణ
రోజులు మారుతున్నాయి, ప్రజలు మారుతున్నారు. కాలానుగుణంగా అభివృద్ధి వైపు ప్రపంచం పరుగులు పెడుతుంది. గ్లోబలైజేషన్ అంటూ తన మన భేదం లేకుండా కొన్ని దేశాలు మినహా మిగతా దేశాలన్నీ స్నేహభావం తోనే ముందుకు వెళ్తున్నాయి. ఇంతా జరుగుతున్నా కూడా భారత్ లో మాత్రం కులం అనే అడ్డుగోడల్ని మాత్రం చెరపలేకపోతున్నారు. కులం అనే గుడ్డితనంలో ఉండిపోయిన కొందరు పలు అవమానీయ ఘటనలకు పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.
కులాంతర వివాహం నేపధ్యంలో ఇప్పటి వరకు ఎన్నో పరువు హత్యలు జరిగిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ తరహా లోనే మరో అవమానీయ ఘటన చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకుందని.. యువతి తరపు వారిలో 40 మందికి గుండు గీయించడమే కాకుండా.. బ్రతికి ఉండగానే పెళ్లి చేసుకున్న జంటకు పెద్దకర్మ సైతం జరిపించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఒడిశాలోని రాయగడ జిల్లా గోరఖ్‌పూర్ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ అమ్మాయి.. షెడ్యూల్డ్ కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించింది. అయితే యువతి తరఫు వారు ఈ వివాహానికి అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ మూడు రోజుల క్రితం లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం నాడు ఆ జంట గ్రామానికి రావడంతో విషయం తెలిసిన పెద్దలు గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువతి ఫ్యామిలీ సభ్యులను గ్రామ బహిష్కరణ చేశారు.
గ్రామంలో నుంచి వెలివేయకుండా ఉండాలంటే.. గుండు చేసుకుని, మూగ జీవాలను బలిచ్చి, కొత్త జంటకు పెద్ద కర్మ చేయాలని గ్రామ పెద్దలు ఆదేశించారు. దీంతో యువతి తరపు కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లో 40 మంది పురుషులు గుండు చేయించుకున్నారు. అలానే స్థానిక ఆలయంలో మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతే కాకుండా పెళ్లి చేసుకున్న నవ దంపతులకు పెద్దకర్మ కూడా జరిపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, తమకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications