అందమైన అమ్మ అక్రమ సంబంధం: 20 సార్లు పొడిచి చంపేశాడు
కర్ణాటకలోని కులబర్గి జిల్లాలోని చిత్తాపుర తాలుకా వాడి పట్టణంలో అనితాబాయి (45) తన కొడుకు విజయ్ కుమార్ (24)తో కలిసి నివాసం ఉంటున్నది. చూడటానికి అందంగా ఉన్న అనితాబాయి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం .
బెంగళూరు: తల్లి అక్రమ సంబంధం సాగిస్తుందని అనుమానం పెంచుకున్న కొడుకు ఆమెను అతిదారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని కులబర్గి జిల్లాలోని చిత్తాపుర తాలుకా వాడి పట్టణంలో జరిగింది. అనితాబాయి (45) అనే మహిళ హత్యకు గురైయ్యింది.
అనితాబాయి తన కుమారుడు విజయ్ కుమార్ (24)తో కలిసి నివాసం ఉంటున్నది. అనితాబాయికి ఆమె భర్త దూరం అయ్యాడు. చూడటానికి ఆమె చాల అందంగా ఉంటుంది. విజయ్ కుమార్ ఇంట్లో లేని సమయంలో అనితాబాయి అందంగా ముస్తాబు అయ్యి బయటకు వెలుతున్నారని సమాచారం.
రాత్రి పొద్దుపోయిన తరువాత అనేక సార్లు అనితాబాయి ఇంటికి వచ్చేదని, ఈ విషయంపై విజయ్ కుమార్ తల్లితో గొడవ పెట్టుకునేవాడని తెలిసింది. సోమవారం రాత్రి ఇదే విషయంపై విజయ్ కుమార్ తల్తితో గొడవపెట్టుకోవడంతో చుట్టుపక్కల వారు సర్దిచెప్పారు.

మంగళవారం మళ్లీ ఇదే విషయంలో అనితాబాయి, ఆమె కుమారుడు విజయ్ కుమార్ గొడవపడ్డారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన విజయ్ కుమార్ కత్తి తీసుకుని తల్లి అనితాబాయిని ఇష్టం వచ్చినట్లు అతిదారుణంగా పొడిచాడు.
20కి పైగా కత్తిపోట్లు పడటంతో అనితాబాయి ఇంట్లోనే కుప్పకూలి మరణించింది. తల్లిని హత్య చేసిన విజయ్ కుమార్ పరారైనాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వాడి పోలీస్ స్టేషన్ సిబ్బంది పారిపోతున్న విజయ్ కుమార్ ను అరెస్టు చేశారు.
తన తల్లి అనితాబాయి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఎన్నిసార్లు చెప్పినా ఆమె పద్దతి మార్చుకోలేదని, పరువు పోతుందనే కారణంతో తానే హత్య చేశానని విజయ్ కుమార్ అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications