భారత్ లో 4జీ డౌన్ లోడ్ స్పీడ్.. దారుణం, ప్రపంచంలోనే సింగపూర్ టాప్
భారత్ లో ఎక్కడ చూసినా ప్రస్తుతం మాట్లాడేది 4జీ గురించే. కానీ అసలు భారత్ లో 4 జీ డౌన్ లోడ్ స్పీడ్ ఎంతుందో తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు డౌన్ లోడ్ స్పీడులో మూడో వంతు కంటే తక్కువ.
న్యూఢిల్లీ: భారత్ లో ఎక్కడ చూసినా ప్రస్తుతం మాట్లాడేది 4జీ గురించే. కానీ అసలు భారత్ లో 4 జీ డౌన్ లోడ్ స్పీడ్ ఎంతుందో తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు డౌన్ లోడ్ స్పీడులో మూడో వంతు కంటే తక్కువ.
భారత్ లో ప్రస్తుతం 4జీ డౌన్ లోడ్ స్పీడ్ కేవలం 5.1 ఎంబీపీఎస్ మాత్రమే ఉన్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు 3జీ డౌన్ లోడ్ స్పీడు కంటే కాస్త ఎక్కువట.

మరి ఈ స్పీడును 4జీ అని ఎలా పిలుస్తాం? ఈ విషయం జనం కంటే బాగా తెలియాల్సింది టెలికాం సర్వీసు ప్రొవైడర్లకే. ఎందుకంటే, ప్రస్తుతం ఏ టెలికాం ఆపరేటర్ ను తీసుకున్నా.. 4 జీ ఆఫర్లంటే అదరగొట్టేస్తున్నాయి. తీరా డేటా కనెక్షన్ తీసుకున్నాక అవి వినియోగదారుడికి ఇస్తున్న డౌన్ లోడ్ స్పీడు మాత్రం అత్యంత దారుణంగా ఉంటోంది.
రిలయన్స్ జియో ఉచిత డేటా సర్వీసులతో డేటా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని, ఫలితంగా ఆర్నెల్లుగా సెకెనుకు ఒక మెగాబైట్ కంటే ఎక్కువగా డౌన్ లోడ్ స్పీడ్ పడిపోతున్నట్లు ఓపెన్ సిగ్నల్ సంస్థ తన రిపోర్టులో నివేదించింది.
రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికాం ఆపరేటర్లు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా కూడా తమ డేటా ధరలను తగ్గించాయని, దీంతో డేటా సర్వీసులకు మరింత డిమాండ్ పెరగడం కూడా డౌన్ లోడ్ స్పీడ్ ఈ స్థాయిలో పడిపోవడానికి మరో కారణమని అంటున్నారు.
నిజానికి 4జీ డౌన్ లోడ్ స్పీడ్ లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది సింగపూర్ దేశం. అలాగే దక్షిణ కొరియా కూడా ముందంజలో ఉంది. ఎటొచ్చీ భారత్ పరిస్థితే దారుణంగా ఉంది. చివరికి పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో 4జీ వేగం కూడా భారత్ కంటే అధికంగా ఉందట.
ప్రపంచ వ్యాప్తంగా సగటు 4జీ డౌన్ లోడ్ స్పీడు 16.2 ఎంబీపీఎస్ గా ఉంది. 2016 చివరి నాటికి భారత్ లో డేటా వినియోగదారుల సంఖ్య 217.95 మిలియన్లుగా ఉంది. అలాగే సగటు డేటా వాడకం కూడా నెలకు 236 ఎంబీ నుంచి 884 ఎంబీ వరకు పెరిగింది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications