మోడీ పంచ్: కాంగ్రెస్ మంత్రి ఇంటిలో కొనసాగుతున్న సోదాలు, పాలు తీసుకెళ్లిన వ్యక్తిని ?
కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో శనివారం ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేస్తున్నారు.
బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో శనివారం ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. శనివారం వేకువ జామున నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు వివిధ పత్రాలు పరిశీలించి వాటి వివరాలపై ఆరా తీస్తున్నారు.
మీడియాకు వార్నింగ్ ఇచ్చిన డీకే బ్రదర్: పరువునష్టం కేసులు పెట్టి, ఏం అనుకుంటున్నారు ?
శనివారం ఉదయం హోటల్ నుంచి డీకే. శివకుమార్ కుటుంబ సభ్యులకు అల్ఫాహారం (టిఫిన్) తెప్పించి ఇచ్చారు. పాలు సరఫరా చేసే వ్యక్తి డీకే. శివకుమార్ ఇంటి దగ్గరకు వస్తే అధికారులు అతన్ని కూడా లోపలికి పంపించకుండా వారే పాలు లోపలికి తీసుకెళ్లి ఇచ్చారు.
మైసూరులోని డీకే. శివకుమార్ మామ తిమ్మయ్య ఇంటిలో నాలుగో రోజు (శనివారం) ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తిమ్మయ్యకు అత్యంత సన్నిహితుడైన ఎడ్వీన్ ను ఇంటికి పిలిపించిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఆయన్ను విచారణ చేస్తున్నారు.
ఐటీ దాడులు: మొత్తం డబ్బు అంతా మాది కాదు, మంత్రి తమ్ముడు రివర్స్ గేర్, మరెవరిది?
డీకే. శివకుమార్ సన్నిహితులైన ఆంజనేయులు, వినయ్ కార్తిక్ ఇచ్చిన సమాచారం మేరకు మంత్రిని విచారణ చెయ్యాలని ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్ణయించారు. బెంగళూరులోని సదాశివనగర్ లోని మంత్రి ఇంటితో సహ దాదాపు 50 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. స్వాధీనం చేసుకున్న విలువైన ప్రతాలు పరిశీలించే పనిలో అధికారులు బిజీబిజీగా ఉన్నారు.