5,611 కేసులు, 24 గంటల్లోనే నమోదు.. మహారాష్ట్రలో ఒక్కరోజే 2 వేల పాజిటివ్ కేసులు..

దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటింది. అయితే గత 24 గంటల్లో 5 వేల 611 పాజిటివ్ కేసులు రికార్డవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 6 వేల 750కి చేరింది. ఇందులో 61 వేల 149 మందికి చికిత్స అందిస్తుండగా.. 42 వేల 298 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 140 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3 వేల 303కి చేరింది.

మొత్తం లక్షకు పైగా పాజిటివ్ కేసుల్లో పారినర్లు కూడా ఉన్నారు. అయితే వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం పెరగడం కాస్త ఊరట కలిగిస్తోంది. బుధవారం ఇది 39.6 శాతంగా ఉంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లోనే 2 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 37 వేల136కి చేరింది. తర్వాత తమిళనాడు 12 వేల 448, గుజరాత్ 12 వేల 140 కేసులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

5,611 coronavirus cases in 24 hours as India sees biggest one-day spike

మంగళవారం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష వెయ్యి 139 ఉండగా.. 58 వేల 802 మంది చికిత్స తీసుకుంటున్నారు. 39 వేల 174 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం 5 వేల 611 కేసులు నమోదవడంతో.. లక్ష 6 వలే 750కి కేసుల సంఖ్య చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+