"5 లక్షల మంది పాకిస్థాన్ అమ్మాయిలతో భారత యువకుల పెళ్లి.. టెర్రరిజంలో కొత్త కోణం?"
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పాకిస్థాన్ నుంచి వచ్చిన వారిని తిరిగి ఆ దేశానికి పంపించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ అమ్మాయిలు పెళ్లి తర్వాత భారత్ లోనే ఉంటున్నారని వాళ్లకు భారత పౌరసత్వం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పాకిస్థాన్ టెర్రరిజంలో కొత్త కోణంగా ఆయన అభివర్ణించారు. ఈమేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఈ వ్యాఖ్యలు చేశారు. " దేశంలో 5 లక్షల మందికి పైగా పాకిస్థాన్ అమ్మాయిలు భారతీయులను వివాహం చేసుకుని తమ దేశానికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. వీళ్లకు భారత పౌరసత్వం లేదు. పాకిస్థాన్ టెర్రరిజంలో ఇదో కొత్త కోణం. ఇలాంటి శత్రువులతో ఎలా పోరాడాలి?" అని ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు.

అంతేకాక జార్ఖండ్ లోని ఓ కార్యక్రమంలో మాట్లాడిన దూబే.. మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2025 చివరి వరకు పాకిస్థాన్ ఉనికిలో లేకుండా పోతుందన్నారు. పాకిస్థాన్ నాలుగు ముక్కులుగా విడిపోతుందని సంచల వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్ ను తిరిగి మోదీ ప్రభుత్వం స్వాధీనం చేసకుంటుందని.. మిగిలింది బలూచిస్థాన్, పంక్తూనిస్థాన్, పంజాబ్ గా విడిపోతాయని తెలిపారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్యారంటీ అని నిశికాంత్ దూబే తెలిపారు.
#WATCH | Deoghar, Jharkhand | On Pakistani citizens living in India, BJP MP Nishikant Dubey says, "... When the process of visa cancellations began, two types of visas emerged and an in-depth investigation is needed. Pakistani girls have been married here, and they cannot become… pic.twitter.com/o0tbe0jI3y
— ANI (@ANI) April 28, 2025
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు మృతి చెందిన తర్వాత ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కు సంబంధించి అన్ని వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు పంజాబ్ లోని అటారీ బోర్డర్ నుంచి గత మూడు రోజుల్లో 537 మంది పాకిస్థాన్ ప్రజలు వాళ్ల దేశానికి వెళ్లిపోయినట్లు అటారీ బోర్డర్ ప్రోటోకాల్ ఆఫీసర్ అరుణ్ పాల్ తెలిపారు. షార్ట్ టర్మ్ వీసాల గడువు ఆదివారంతో ముగిసిందని తెలిపారు.
మరోవైపు గడచిన మూడు రోజుల్లో పాకిస్థాన్ నుంచి 850 మంది భారత్ కు వచ్చారని అన్నారు. ఆదివారం ఒక్కరోజే 237 మంది పాకిస్థాన్ వెళ్లిపోగా 116 మంది భారతీయులు స్వదేశానికి వచ్చినట్లు అరుణ్ పాల్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications