17 ఏళ్ల మైనర్ బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్... గన్‌తో బెదిరించి,బాయ్‌ఫ్రెండ్‌ను కట్టేసి...
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో దారుణం వెలుగుచూసింది. 17 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం... మంగళవారం రాత్రి జంషెడ్‌పూర్‌లోని బాగ్బెరా ప్రాంతంలో ఓ బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయటకెళ్లింది. ఆ సమయంలో ఐదుగురు వ్యక్తులు ఆ జంట వద్దకు వచ్చి గన్‌తో బెదిరించారు. బలవంతంగా ఆ యువతిని,ఆమె బాయ్‌ఫ్రెండ్‌ని కలియదిహ్ గౌశాలకు తీసుకెళ్లారు. అక్కడ ఆమె బాయ్‌ఫ్రెండ్‌ని తాళ్లతో కట్టి పడేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

బాలిక ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తమిళ్ వానన్ తెలిపారు. తాను డ్యాన్స్ క్లాస్ వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని మొదట ఆ బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. కానీ విచారణలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లినట్లు గుర్తించామన్నారు.
నిందితులను శంకర్ తియు,రోషన్ కుజుర్,సూరజ్ పాత్రో,సన్నీ సొరెన్‌గా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. నిందితుల్లో ఒకరు మైనర్ అని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక గన్‌తో పాటు రెండు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మైనర్ బాలుడిని జువైనల్ హోమ్‌కి తరలించి... మిగతా ముగ్గురు నిందితులను జైలు రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
Recommended Video
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశమంతా భగ్గుమంటున్నా మహిళలపై నేరాలు మాత్రం ఆగట్లేదు. దేశంలో నిత్యం ఎక్కడో చోట మహిళలు అత్యాచారాలు,నేరాలకు గురవుతూనే ఉన్నారు. 2019 నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం ప్రతీ 16 నిమిషాలకో భారత్‌లో ఒక అత్యాచార ఘటన జరుగుతోంది. ప్రతీ రోజూ 88 మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధుల్లో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications