వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో వడ్డన.. ఇక ఆటో వంతు.. అన్నీ ఆటోలు కాదు..

|
Google Oneindia TeluguNews

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇప్పటికే నిత్యవసర వస్తుల ధరలపై జీఎస‍్టీని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మరో నిర్ణయం తీసుకుంది. ఆటోలో ప్రయాణించే వారిపై జీఎస్టీ విధించనున్నాయి. ఆటో ఎక్కినా ఇకపై చార్జీకి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. ఆటో రిక్షా బుకింగ్ పై 5 శాతం జీఎస్టీ వసూలుకు నిర్ణయించింది.

 5 percent gst auto rickshaw services

జీఎస్టీ సాధారణంగా నడిచే షేర్‌, ఇతర ఆటోలు కాదని స్పష్టంచేసింది. దీంతో మెజార్టీ మంది ఊపిరి పీల్చుకున్నారు. కేవలం రైడ్‌ షేరింగ్‌ కంపెనీలు ఓలా, ఊబర్‌ సంస్థల సేవలందించే ఆటోల్లో ప్రయాణించే వారికి మాత్రమే జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. ఇదీ ఊరట కలిగించే అంశం.. ఆయా సంస్థలు.. కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే ఉండేవి. చిన్న నగరాలకు ఇంకా వ్యాపించలేదు. సో దీంతో ఎక్కువ మంది బాధపడరు.. కానీ కొందరు మాత్రం ఇబ్బంది పడటం సహాజమే కానుంది.

5 శాతం జీఎస్టీకి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఈ నెల 18వ తేదీన ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ కొత్త జీఎస్టీ నిబంధనలు వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్‌పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దానిని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది. దీంతో ఈ కామర్స్ మీద బుక్ చేసే వారు మాత్రం.. తప్పకుండా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది.

English summary
5 percent gst auto rickshaw services. through e-commerce platforms only not share autos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X