5 ఏళ్ళ కూతురిపై అత్యాచారం, కొడుకు కోసం మనుమరాలిని చంపిన నానమ్మ

కంటిరెప్పే కాటేసింది. ఐదేళ్ళ చిన్నారిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతోందనే ఉద్దేశ్యంతోనే నానమ్మే తన మనుమరాలిని చంపేసింది. తన కొడుకును కాపాడేందుకుగాను ఆమె ఈ రకంగా వ

నాసిక్: కంటిరెప్పే కాటేసింది. ఐదేళ్ళ చిన్నారిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతోందనే ఉద్దేశ్యంతోనే నానమ్మే తన మనుమరాలిని చంపేసింది. తన కొడుకును కాపాడేందుకుగాను ఆమె ఈ రకంగా వ్యవహరించింది.ఈ ఘటన మహరాష్ట్రలోని నాసిక్ లో చోటుచేసుకొంది.

మహరాష్ట్రలోని నాసిక్ సమీప జవులేక్ వాని గ్రామంలో సచిన్ షిండే నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఐదేళ్ల కూతురిపై అతను అత్యాచారానికి ఒడిగట్టాడు. సచిన్ ఐదేళ్ళకూతురిపై అత్యాచారానికి ఒడిగడుతుండగా అతని తల్లి అనసూయ చూసింది.

5 year Old girl allegedly raped by father, Killed by grandmother in Nashik

అయితే తన కొడుకును ఆపలేదు. ఈ విషయం తెలిస్తే పరువు పోతోందని భావించింది. కూతుర్ని రేప్ చేశాడని తెలిస్తే తన కొడుకును పోలీసులు పట్టుకెళ్తారని ఆమె భావించింది. దీంతో ఆమె మనమరాలి గొంతు నులిమి చంపింది.

ఈ ఘటన సమయంలో సచిన్ షిండే భార్య ఇంట్లో లేదు. పాపశవాన్ని తీసుకెళ్ళి సమీపంలోని ఓ స్కూల్ గోడవద్ద పడేసింది నానమ్మ.తన మనమరాలిని ఎవరో కిడ్నాప్ చేసి, హత్య చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది. పాప మృతదేహం వద్దకు వెళ్ళిన డాగ్ స్క్వాడ్ తో పాటు పాప మృతదేహం వద్దకు వెళ్ళి షిండే ఇంటివైపుకు వచ్చాయి. దీంతో పోలీసులు అనుమానంతో విచారణను ప్రారంభించారు.

సచిన్ , అతని తల్లి అనసూయలను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. సచిన్ పై అత్యాచారం , ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనసూయపై హత్య నేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+