బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో ఐదేళ్ల బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్, కోమాలో మృత్యువుతో పోరాటం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లి సామూహిక అత్యాచారం చేసి తరువాత బాలికను ఆమె ఇంటి ముందు విసిరివేసి వెళ్లిన సంఘటన బెంగళూరు నగరంలోని కాడుగోండనహళ్ళి (కేజీ హళ్ళి) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

సామూహిక అత్యాచారం చెయ్యడంతో బాలిక కోమాలోకి వెళ్లిపోయిందని, శివాజీనగరలోని బౌరింగ్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోందని పోలీసులు అన్నారు. కేజీ హళ్ళిలోని వయ్యాలికావెల్ సోసైటీ సమీపంలోని ఇంటి దగ్గర బాలికను శుక్రవారం రాత్రి కిడ్నాప్ చేశారు.

5 year old girl gang raped in Bengaluru

సామూహిక అత్యాచారం చేసిన తరువాత అర్దరాత్రి బాలికను ఇంటి ముందు విసిరివేసి వెళ్లారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలిక ఇంటి ముందు ఎలాంటి సీసీకెమెరాలు ఏర్పాటు చెయ్యలేదని, నిందితుల ఆచూకి చిక్కడం లేదని పోలీసులు అంటున్నారు.

బెంగళూరు తూర్పు విభాగం డీసీపీ అజయ్ హిలోరీ బౌరింగ్ ఆసుపత్రి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులను విచారించి వివరాలు సేకరించారు. శనివారం వేకువ జామున మూడు గంటల సమయంలో బాలికను ఆసుపత్రికి తీసుకు వచ్చారని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని బౌరింగ్ ఆసుపత్రి డీన్ మంజునాథ్ అంటున్నారు.

English summary
5 year old girl gang raped in Kadugondugondanahalli police station limit, Bengaluru. Girl thrown away near her home on Friday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X