పదేళ్ల తర్వాత భార్య కనిపించడం లేదని ఫిర్యాదు

పదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తన భార్య కస్తూరి తిరిగి రాలేదని అన్నప్ప నాయక్ అనే వ్యక్తి ఉల్లాల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
తన భార్య కోసం అన్వేషించాలని, ప్రమాదంలో రెండు కాళ్లు పోయి తాను అవస్థలు పడుతున్నానని, తనను చూసుకోవడానికి భార్య అవసరం ఎంతో ఉందని అతను పోలీసులకు చెప్పాడు. పదేళ్ల క్రితం ఇళ్లు విడిచి వెళ్లిన తన భార్య కస్తూరి ఇప్పటికీ తిరిగి రాలేదని అతను చెప్పాడు. ఇంత కాలం తన భార్య అదృశ్యంపై ఏ విధమైన ఫిర్యాదు చేయలేదు. ఒంటరిగానే జీవిస్తూ వస్తున్నాడు.
భార్య లేకపోవడంతో కాళ్లు విరిగిన స్థితిలో తనను చూసుకోవడానికి ఎవరూ లేక ఇబ్బందులు పడుతున్న స్థితిలో భార్య గుర్తుకు వచ్చింది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications