300 మంది మహిళలకు అసభ్యకర సందేశాలు, అరెస్ట్

ముంబై: 53 ఏళ్ల ఓ వ్యక్తి లాయర్, డాక్టర్, కౌన్సిలర్, ఉపాధ్యాయురాలు, నర్స్, విద్యార్థిని... ఇలా దాదాపు మూడు వందలమంది మహిళలకు అసభ్యకర సందేశాలు పంపించాడు. దీనిపై ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతనిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

అభిరామ్ అతుల్కర్ అనే 53 ఏళ్ల వ్యక్తి చాలామంది మహిళలను వేధించాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 300 మంది మహిళల్ని అభిరామ్ అతుల్కర్ వేధించాడని పోలీసులు వెల్లడించారు. మూడు నెలల క్రితం పయ్ అలీబాగ్ మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలుకు ఓ అసభ్య మెసేజ్ వచ్చింది.

53 yr old held for sending lewd texts to 300 women

దీనిని ఏవరో ఆకతాయి పనిగా తీసిపారేసిన ఆమె, తరువాత వరుసగా మెసేజ్‌లు వస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫోన్ నెంబర్ పైన కూపీలాగారు. దీంతో అతని బండారం బట్టబయలైంది.

అభిరామ్ కొంతమందికి లేఖలు కూడా రాసేవాడని పోలీసులు వెల్లడించారు. అయితే అతని నిర్వాకంపై పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఇలాంటి వారి ఆటకట్టించాలంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఫిర్యాదు చేసిన మహిళ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+