గుడ్ న్యూస్.. దేశంలోకి 5జీ.. మరో మూడునెలల్లో అందుబాటులోకి..
4జీ ముగిసింది. 5జీ కోసం యువత కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. స్పీడ్ కోసం ఆత్రుతతో వెయిట్ చేస్తోంది. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే మౌలిక సదుపాయాలపరంగా సమస్యలు మాత్రం ఉన్నాయి. టెక్నాలజీకి కీలకమైన ఆప్టికల్ ఫైబర్ ఆధారిత ఇన్‌ఫ్రా ఇంకా సిద్ధంగా లేదు. కొన్ని ప్రాంతాలకు మాత్రమే 5జీ నెట్‌వర్క్‌ను పరిమితం చేయాల్సి వస్తుందని టెలికం పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై భారత్ సత్వరం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే కొత్త తరం టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకోలేకపోవచ్చని నోకియా ఇండియా హెడ్ అమిత్ మార్వా తెలిపారు. 5జీ అనేది ఆపరేటర్లు సొమ్ము చేసుకునే మరో మార్గంగా భావించొద్దు అని.. దేశానికి, ప్రపంచానికి ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రస్తుతం ఇది ఎంతో అవసరం అంటున్నారు.

భారత్‌లో 5జీ రూపొందిస్తున్నామని.. హార్డ్‌వేర్ సిద్ధంగా ఉందన్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మూడు నెలల్లోనే భారత్‌లో 5జీ నెట్‌వర్క్ వినియోగంలోకి రావొచ్చు అని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీను అభివృద్ధి చేయాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని టెలికం ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ సందీప్ అగర్వాల్ తెలిపారు. రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
చైనాలో కొత్త టెక్నాలజీను అభివృద్ధి చేసేందుకు స్థానిక కంపెనీలకు దాదాపు 200 బిలియన్ డాలర్ల దాకా ప్రభుత్వమే సమకూరుస్తోందని వివరించారు. భారత్ టెక్నాలజీలను పూర్తి స్థాయిలో రూపొందించే పరిస్థితి లేదని, మిగతా వారి నుంచి కూడా మద్దతు తీసుకోవాల్సిన ఉంటోందని టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సీఈవో అరవింద్ బాలి తెలిపారు.












Click it and Unblock the Notifications