Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

5 కేజీల సిలిండర్లకూ దిక్కులేదు

LPG Cylinder Price: వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ.195. 50 పైసలు పెరిగాయి. ఈ ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.

వీటితో పాటు దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు పెరిగాయి. కిలో లీటరుకు ఢిల్లీ- రూ. 2,07,341.22, కోల్‌కతా- రూ. 2,05,953.33, ముంబై- 194,968.67, చెన్నై- 2,14,597.66 పలుకుతోంది. ఇంధన ఖర్చుల సర్దుబాట్ల కారణంగా వచ్చిన ఈ పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావాన్ని చూపుతుంది. విమాన ఛార్జీలకు రెక్కలు మొలవడం ఖాయంగా కనిపిస్తోంది.

5kg Cylinder Price Up by Rs 51 Effective Today as FTL Rates Hike as Record Price Jump by OMCs

జెట్ ఇంధనం.. విమానయాన సంస్థల ప్రధాన వ్యయం. ఏటీఎఫ్ ధరలు పెరిగినప్పుడు, విమానయాన సంస్థలు ఈ భారాన్ని ప్రయాణికులపై మోపుతాయి. దీనివల్ల దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లు మరింత ఖరీదైనవిగా మారుతాయనడంలో సందేహాలు అక్కర్లేదు. విమాన కార్గో ఛార్జీల పెరుగుదలతో ఎలక్ట్రానిక్స్ నుండి తాజా ఉత్పత్తుల వరకు వాయు మార్గంలో రవాణా అయ్యే వస్తువులు ఖరీదైనవిగా మారతాయి. రిటైలర్లు ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయడంతో, దిగుమతి చేసుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి.

ఇది పరోక్ష ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఏటీఎఫ్ రేట్ల పెరుగుదల పర్యాటకం, విమానయాన ఉద్యోగాలు, హోటళ్లు, ట్యాక్సీలు, రెస్టారెంట్ల వంటి అనుబంధ సేవలను కూడా ప్రభావితం చేస్తుంది. చమురు ధరలలో వచ్చిన విపరీతమైన పెరుగుదలకు నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ విమానయాన సంస్థలు ఛార్జీలను పెంచాయి. సర్వీసులను తగ్గించాయి.

ఇది ఇక్కడితో పరిమితం కావట్లేదు. అయిదు కిలోల ఎల్‌పీజీ సిలిండర్ కూడా ప్రియం అయింది. అయిదు కిలోల ఎఫ్‌టీఎల్ (FTL) సిలిండర్ నింపుకోవడానికి ఇప్పుడు 549 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. దీని ధర ఏకంగా 51 రూపాయలు పెరిగింది. వివిధ మెట్రో నగరాల్లో ఈ చిన్న సిలిండర్ల రేట్లు మారుతుంటాయి. 51 రూపాయల నుంచి గరిష్టంగా 68 రూపాయల వరకు వీటి పెంపు ప్రభావం వినియోగదారులపై పడుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+