ఆ విషయంలో మహారాష్ట్ర కంటే జార్ఖండ్ మిన్న..!!
Maharashtra Assembly elections polling 2024: జార్ఖండ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. మొత్తం 38 నియోజకవర్గాల్లో పలువురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.
అటు మహారాష్ట్రలో 288 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. జార్ఖండ్‌తో పోల్చుకుంటే మహారాష్ట్రలో తొలి రెండు గంటల్లో పోలింగ్ మందకొడిగా సాగడం గమనార్హం. ఉదయం 9 గంటలకు జార్ఖండ్‌లో 12.71 శాతం మేర పోలింగ్ రిజిస్టర్ అయింది. మహారాష్ట్రలో ఈ సంఖ్య 6.61 శాతమే.

ఈ రెండింటితో పాటు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కూడా ముమ్మరంగా సాగుతోంది. మహారాష్ట్రలోని నాందెడ్ లోక్‌సభ నియోజకవర్గానికీ ఉప ఎన్నిక నేడే జరుగుతోంది. కాంగ్రెస్ సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడు వసంత్ రావ్ బల్వంత్ రావ్ చవాన్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అవసరమైంది.
పాలక్కాడ్- కేరళ 12.63, చబ్బెవాల్- పంజాబ్ 4.15, గిద్దర్‌బాహా- పంజాబ్ 15.11, డేరా బాబా నానక్- పంజాబ్ 9.70, బర్నాలా- పంజాబ్ 6.80, ఘజియాబాద్- ఉత్తర ప్రదేశ్ 5.73, మఝవాన్- ఉత్తర ప్రదేశ్ 10.55, మీరాపూర్- ఉత్తర ప్రదేశ్ 13.01, ఖైర్- ఉత్తర ప్రదేశ్ 9.03 శాతం మేర పోలింగ్ నమోదైంది.

అలాగే ఫూల్‌పూర్- ఉత్తర ప్రదేశ్ 8.83, కుందార్కి- ఉత్తర ప్రదేశ్ 13.59, కర్హాల్- ఉత్తర్ ప్రదేశ్ 9.67, కటేహారి- ఉత్తర ప్రదేశ్ 11.48, కేదార్‌నాథ్- ఉత్తరాఖండ్ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలో 4.30 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications