అసోం: ఉగ్రవాదులదాడిలో ఆరుగురు జవాన్లు అంతం

మణిపూర్: అసోంలో ఉగ్రవాదులు మరో సారి రెచ్చిపోయారు. అసోం రైఫిల్స్ కాన్వాయ్ ని లక్షంగా చేసుకుని దాడులు చెయ్యడంతో ఆరు మంది జవాన్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనేక మందికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

అసోంలోని చాదల్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. అసోం రైఫిల్స్ జవాన్లు తనిఖీలు ముగించుకుని వాహనాల్లో తిరుగు ప్రయాణం అయ్యారు. అప్పటి వరకు వేచి ఉన్న ఉగ్రవాదులు అదును చూసి మందు పాతరలో కాన్వాయ్ మీద దాడులు చేశారు.

6 Assam rifles personnel killed in Manipur

దాడి చేసిన ఉగ్రవాదులు ఆరుగురు జవాన్లను ప్రాణాలతో పట్టుకుని కిడ్నాప్ చేశారని అధికారుల ప్రాథమి విచారణలో వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరణించిన జావాన్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

శ్రీనగర్ లో

శ్రీనగర్ లో పోలీసులను లక్షంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు పోలీసులు మరణించగా ఇద్దరికి తీవ్రగాయాలైనాయని అధికారులు చెప్పారు. జదీబాల్ పోలీస్ అవుట్ పోస్ట్ పై సోమవారం ఉదయం అతి సమీపం నుంచి ఉగ్రవాదులు దాడులు చేశారు. పోలీసుల తుపాకులు ఎత్తుకుని అక్కడి నుంచి పారిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+