న్యూ ఇయర్ పార్టీలో అపశృతి, పారిశ్రామికవేత్త ఫాం హౌస్ లో లిఫ్ట్ కుప్పకూలి 6 మంది దుర్మరణం !

ఇండోర్: నూతన సంవత్సరం 2020 వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల్లో ఉల్లాసంగా గడుపుతూ సందడి చేస్తున్న సమయంలో ఒక్కసారిగా లిఫ్ట్ కుప్పకూలిపోవడంతో ఆరు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మధ్యప్రదేశ్ లో ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఆయన ఫాం హౌస్ లో ఇచ్చిన పార్టీలో ఈ విషాదం చోటుచేసుకుంది.

పారిశ్రామికవేత్త ఫాం హౌస్

పారిశ్రామికవేత్త ఫాం హౌస్

మధ్యప్రదేశ్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పునిత్ అగర్వాల్ కు పాటల్ పానీ ప్రాంతంలో విశాలమైన ఫాం హౌస్ ఉంది. తన ఫాం హౌస్ లో 2020 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించడానికి కొన్ని రోజుల నుంచి పునిత్ అగర్వాల్ ఏర్పాట్లు చేశారు.

న్యూ ఇయర్ పార్టీ

న్యూ ఇయర్ పార్టీ

మంగళవారం రాత్రి ఫాం హౌస్ లో జరిగే పార్టీకి మీరు కచ్చితంగా హాజరుకావాలని పునిత్ అగర్వాల్ సాటి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, బంధువులు, స్నేహితులను ఆహ్వానించారు. మంగళవారం రాత్రి పునిత్ అగర్వాల్ తో పాటు, ఆయన కుటుంబ సభ్యులు, ఆహ్వానితులు అందరూ న్యూ ఇయర్ వేడుకలకు హాజరైనారు.

సందడి చేస్తుంటే !

సందడి చేస్తుంటే !

న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న సమయంలో కొందరు ఫాం హౌస్ లోని ఓ కట్టడం పైనుంచి కిందకు దిగడానికి లిఫ్ట్ ఎక్కారు. ఆ సమయంలో లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరు మంది మృతి చెందారని, మరి కొందరికి తీవ్రగాయాలైనాయని అడిషనల్ పోలీసు కమిషనర్ ధర్మరాజ్ మీనా చెప్పారు.

 లిఫ్ట్ బెల్ట్ కట్

లిఫ్ట్ బెల్ట్ కట్

ఈ ప్రమాదంలో మృతి చెందిన వివరాలు సేకరిస్తున్నామని, లిఫ్ట్ బెల్ట్ పూర్తిగా తెగిపోవడం వలనే ప్రమాదం జరిగిందని అడిషనల్ పోలీసు కమిషనర్ ధర్మరాజ్ మీనా తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో అపశృతి చోటుచేసుకోవడంతో పారిశ్రామికవేత్త పునిత్ అగర్వాల్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+