వామ్మో.. ఈ లేడీ నిజంగా కేడీయే.. 3 నెలల్లో 6 పెళ్లిళ్లు.. ఎక్కడ అంటే
నిత్య పెళ్లి కొడుకు గురించి తెలుసు.. నిత్య పెళ్లి కూతుళ్ల గురించి.. రేర్‌గా వింటాం.. అలాంటి ఓ కేడీ మగాళ్లను మోసం చేసింది. 3 నెలల్లో ఆరు పెళ్లిళ్లు చేసుకుంది. చివరికీ పట్టుడింది. ఆ కేడీ లేడీని హర్యానాలో పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి నుంచి ఆమె ఇప్పటివరకు ఆరు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమెకు గతంలోనే తొలి వివాహం జరగ్గా, మోసాల బాటపట్టిన ఆమె విడాకులు తీసుకున్నవారు, పెళ్లికాని యువకులను లక్ష్యంగా చేసుకుని వంచనకు పాల్పడుతుంది.

నాలుగో భర్త..
నాలుగో భర్త రాజేందర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతిని, ఆమెకు సహకరిస్తున్న మరికొందరిని అరెస్ట్ చేశారు. విచారణలో ఆమె అన్ని విషయాలు వెల్లడించింది. ఖేదీ కరమ్ షామ్లి ప్రాంతానికి చెందిన సతీశ్‌ను మొదటి వివాహం చేసుకుంది, అక్కడి నుంచి తన నిత్య కల్యాణానికి తెరలేపింది. ఈ ఏడాది జనవరి 1న రాజస్థాన్ లో రెండో వివాహం, ఫిబ్రవరి 15న మూడో వివాహం, మరో 6 రోజుల తేడాతో రాజేందర్ అనే వ్యక్తిని నాలుగో వివాహం చేసుకుంది.

ఐదో పెళ్లి
కుటానా ప్రాంతానికి చెందిన గౌరవ్‌ను ఐదో పెళ్లి చేసుకుంది. కర్నాలకు చెందిన సందీప్‌తో ఆరో వివాహం జరిగింది. మార్చి 26న బుద్వా ప్రాంతానికి చెందిన సుమిత్‌ను ఏడో వివాహం చేసుకుంది. వివిధ సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తనకు ఎవరూ లేరని ఆమె నమ్మించేదని, తన వలలో ఎవరైనా పడితే వారిని పెళ్లి వరకు తీసుకువచ్చేదని తెలిసింది.

ఆమె ముఠా
ఆమెకు ముఠా సభ్యులు సహాయ సహాకారాలు అందించేవారు. మొదటి రాత్రే తన పన్నాగం అమలు చేసేది. శోభనం రాత్రే భర్తకు మత్తుమందు ఇచ్చి, అతడు స్పృహ కోల్పోయాక డబ్బు, నగలతో పరారయ్యేది. ఇలా అందరినీ మోసం చేస్తూ వచ్చింది. కానీ చివరకు ఇలా పట్టుబడింది. ఆమె పాపం పండి.. ఆమె మోసాలు వెలుగులోకి వచ్చాయి. కానీ అందరినీ చక్కగా నమ్మించేది.. వారు కూడా ఆమె మాయమాటలు నమ్మేవారు. పెళ్లి కూడా చేసుకొని.. శోభనం రోజు వరకు వీక్షించేవారు. ఆ తర్వాత ఆ కేడీ మాయమయ్యేది. ఆ తర్వాతే మోసపోయామని గుర్తించేవారు.












Click it and Unblock the Notifications