దారుణం: గుజరాత్‌లో ఆరు నెలల పసిబిడ్డపై అత్యాచారం

వారు పెద్దపిల్లలను వెంటబెట్టుకుని ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళుతూ.. ఈ ఆరు నెలల పాపను పొరుగునే ఉన్న భవాన్జీ థాకూర్ (32) అనే వ్యక్తి అప్పగించి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏడుస్తున్న చిన్నారిని తల్లిదండ్రులకు ఇ్చచి థాకూర్ వెళ్లిపోయాడు.
గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవడాన్ని గమనించిన తల్లిదండ్రులు... థాకూర్ వద్దకు వెళ్లి చిన్నారిపై జరిగిన అత్యాచారం గురించి ప్రశ్నించగా, థాకూర్ ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు.
దీంతో తొలుత చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు. వెనువెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చిన్నారి పరిస్ధితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications