ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధర తగ్గుముఖం పడుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,170కి తగ్గింది. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో బంగారం ధర నెల రోజుల్లో దాదాపు 6 శాతం తగ్గింది. మే 24న బంగారం ధరలు గరిష్టంగా రూ.62,720కి చేరాయి. ఆ తర్వాత నుంచి క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. ఇటువంటి తరుణంలోనే బంగారాన్ని కొనుగోలు చేయాలా? లేదంటే ఇంకా తగ్గుతుందా? అనే విషయమై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

స్వల్పకాలంలో బంగారం తన సురక్షితమైన ఆకర్షణను కోల్పోయిందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ ద్రవ్య వైఖరి గురించి చాలా కఠినంగా ఉంటాయని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, US ఫెడ్ గత 15 నెలల్లో వడ్డీ రేట్లను 500 bps, BoE 475 bps, ECB 400 bps చొప్పున పెంచిందని వెల్లడించారు.

The price of gold is falling in the country.

ప్రస్తుతం ఉన్న ధర నుంచి మరో 4 నుంచి 3 శాతం వరకు తగ్గొచ్చని, ధరలు మరింత బలహీనమవుతాయంటున్నారు. వచ్చే 2 నెలల్లో ఈ పరిణామాలుంటాయన్నారు.
ఈ మధ్య కాలంలో బంగారం ధర తగ్గుముఖం పట్టిందని, ప్రపంచ ఆర్థిక గణాంకాలు, కేంద్ర బ్యాంకుల చర్యలను పరిశీలిస్తే కేవలం ప్రాఫిట్ బుకింగ్ కారణంగానే బంగారం ధర పతనం కనిపిస్తోంనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బంగారం కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయమని, ఈ ఏడాది చివరినాటికి ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి తీసుకువెళుతుందంటున్నారు. పెట్టుబడిదారులు సురక్షితమైనదానికోసం అన్వేషిస్తారని, దీంతో బంగారం డిమాండ్ పెరుగుతుందంటున్నారు. 2023 చివరి నాటికి ప్రపంచం మాంద్యంలో చిక్కుకుంటుదని, పది గ్రాముల బంగారం ధర 65 వేలకు చేరుకుంటుందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+