వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కరోనా: 6రాష్ట్రాల్లోనే 84శాతం కేసులు -19 రాష్ట్రాలు, యూటీల్లో మరణాలు సున్నా

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా విలయానికి సంబంధించి కొద్ది రోజులుగా నమోదవుతోన్న గణాంకాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కేసుల తీవ్రత ఒక్కో దిక్కున వేర్వేరుగా ఉంటోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,921 కొత్త కేసులు నమోదుకాగా, ఇందులో మెజార్టీ కేసులు కేవలం ఆరు రాష్ట్రాల్లోనే వెలుగు చూశాయి. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరణాలు దాదాపు ఆగిపోయాయి..

మోదీ, పవన్‌కు 'మాస్టర్' స్ట్రోక్ - విశాఖ ఉక్కు ఉద్యమానికి చిరంజీవి మద్దతు -సంచలన ప్రకటన, పూర్తి పాఠంమోదీ, పవన్‌కు 'మాస్టర్' స్ట్రోక్ - విశాఖ ఉక్కు ఉద్యమానికి చిరంజీవి మద్దతు -సంచలన ప్రకటన, పూర్తి పాఠం

దేశంలో నమోదవుతోన్న కొత్త కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు నుంచే ఎక్కువగా ఉన్నాయని, నమోదయిన కేసుల్లో 84 (83.76)శాతం ఈ ఆరు రాష్ట్రాల్లోనే వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 1.84 లక్షలకు చేరింది.

 6 States Account for Over 80% of Fresh Covid-19 Cases; Active Cases Tally at 1.84 Lakh

మహారాష్ట్రలో అత్యధికంగా 9,927 కొత్త కేసులు రాగా.. కేరళలో 2,316, పంజాబ్‌లో 1,027 కొత్త కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గడిచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్కరు కూడా కరోనా వల్ల మరణించలేదని పేర్కొన్నారు. మరోవైపు,

షాకింగ్: బెంగాల్ సీఎంపై దాడి -గాయపడ్డ దీదీ -డీజీపీ మార్పు ఎఫెక్ట్ -డ్రామా అంటోన్న బీజేపీషాకింగ్: బెంగాల్ సీఎంపై దాడి -గాయపడ్డ దీదీ -డీజీపీ మార్పు ఎఫెక్ట్ -డ్రామా అంటోన్న బీజేపీ

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 13.5 లక్షల డోసులు పంపిణీ చేయగా, మొత్తంగా ఇప్పటి వరకు 3,39,145 సెషన్లలో కలిపి 2.43(2,43,67,906) కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 71,30,098 మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌, 69,36,480 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కి తొలి డోస్‌ ఇవ్వగా, 38,90,257 మంది హెచ్‌సీడబ్ల్యూ, 4,73,422 మంది ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలకు రెండో డోస్‌ అందించినట్లు తెలిపారు. కర్ణాటకకు చెందిన వయోవృద్ధురాలు జె. కామేశ్వరికి టీకా ఇవ్వడంతో దేశంలో 103 ఏళ్ల వయసులో వ్యాక్సిన్‌ తీసుకున్న మహిళగా రికార్టు సృష్టించారు.

English summary
Six states — Maharashtra, Kerala, Punjab, Karnataka, Gujarat and Tamil Nadu — accounted for 83.76 per cent of the17,921 cases of COVID-19 reported in the country in a day, the Union Health Ministry said on Wednesday. India's tally of active COVID-19 cases stood at 1.84 lakh and comprised 1.64 per cent of the total infections, according to the ministry's data.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X